రష్మి గౌతమ్‌ నటించిన సీరియల్స్ ఏవో తెలుసా? బుల్లితెరకే పరిమితం కావడానికి కారణం అదేనా?.. క్రేజీ విషయాలు వెల్లడి

Published : Feb 18, 2024, 06:50 PM IST

రష్మి కెరీర్‌ బిగినింగ్‌లో సీరియల్స్ లోనూ నటించింది. అంతేకాదు సినిమా కంటే టీవీనే బెటర్‌ అని నిర్ణయించుకోవడానికి కారణం అవే అట. పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను రివీల్‌ చేసింది రష్మి.   

PREV
18
రష్మి గౌతమ్‌ నటించిన సీరియల్స్ ఏవో తెలుసా? బుల్లితెరకే పరిమితం కావడానికి కారణం అదేనా?.. క్రేజీ విషయాలు వెల్లడి

యాంకర్‌ రష్మి ఇప్పుడు జబర్దస్త్ యాంకర్‌గా బిజీగా ఉంది. అంతేకాదు హాట్‌ యాంకర్‌గా దుమ్మురేపుతుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. పదేళ్లుగా షోని సక్సెస్‌ ఫుల్‌ గా నడవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే రష్మి బుల్లితెరకే పరిమితం కావడానికి, ఆమె టీవీని నమ్మడానికి కారణమేంటి అనేది చూస్తే..

28

యాంకర్‌ రష్మి.. కెరీర్‌ సినిమాలతోనే ప్రారంభమైంది. ఆమె 2002-03 టైమ్‌లో `థ్యాంక్స్` అనే చిత్రంలో నటించింది. ఇందులో హీరోయిన్‌ తరహా రోల్‌ చేసింది. రొమాన్స్ తో రచ్చ చేసింది. గ్లామర్‌ ట్రీట్‌తో అప్పట్లోనే నెక్ట్స్ లెవల్‌ షో చేసింది. ఆమె సినిమా ఇప్పటికీ యూట్యూబ్‌ ట్రెండ్‌ అవుతుందట. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ఇంటర్వ్యూలో తెలిపింది. 
 

38

అంతేకాదు ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను, అరుదైన విషయాలను వెల్లడించింది. తాను ప్రారంభంలో సీరియల్స్ లో నటించిందట. `థ్యాంక్స్‌` మూవీ తనకు పెద్దగా పేరు తెలేదు. పైగా అందులోని పాత్ర కారణంగా తనపై పలు ట్రోల్స్, విమర్శలు వచ్చాయట. పైగా ఆఫర్లు రాలేదు. దీంతో ఆమె ఇంటికెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్లీ కొంత గ్యాప్‌తో రీఎంట్రీ ఇచ్చింది. 
 

48

ఆ సమయంలో `యువ` అనే సీరియల్‌లో నటించే ఆఫర్‌ వచ్చిందట. అందులో స్వాతి అనే పాత్రలో కనిపించింది రష్మి గౌతమ్‌. రొమాన్స్ ని ఎక్కువగా ఇష్టపడే మహిళగా, మగరాయుడిలా ఫీలవుతుందట. ఏ పనైనా బ్రహ్మాండంగా ప్రారంభిస్తుందట, కానీ చివరికి తుస్సుమనిస్తుందట. అలా ఒక క్రేజీ పాత్రలో నటించి మెప్పించింది రష్మి.దీనికి ఆమెకి మంచి పేరు వచ్చింది. 

58

ఈ సీరియల్‌ `మా`టీవీలో వచ్చింది. కామెడీ ప్రధానంగా సాగే సీరియల్‌ ఇది. ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్న చాలా మంది ఇందులో నటించడం విశేషం. దీంతోపాటు `లవ్‌` అనే మరో సీరియల్‌ కూడా `మా`టీవీలోనే చేసింది. దీంతో రష్మిక మంచి గుర్తింపు వచ్చింది. టీవీలో మంచి ఆదరణ లభించింది. వీటి కారణంగా తనకు మళ్లీ సినిమా ఆఫర్లు వచ్చాయి. 
 

68

అలా `కరెంట్‌`, `ఎవరైనా ఎప్పుడైనా`, `గణేష్‌`, `బిందాస్‌`, `ప్రస్థానం` చిత్రాలు చేసింది. `ప్రస్థానం` ఆమెకి మంచి పేరు తెచ్చింది. దీంతోపాటు తమిళం, హిందీ, కన్నడలోనూ మెరిసింది. ఈ క్రమంలో తనకు `జబర్దస్త్`లో నటించే ఆఫర్‌ వచ్చింది. అయితే సినిమాల్లో కొంత బోల్డ్ రోల్‌ రావడం, ఆమెపై పలు విమర్శలు రావడంతో బుల్లితెరనే బెటర్‌ అనుకుందట.

78

అలా `జబర్దస్త్` తర్వాత ఆమె పెద్దగా సినిమాలపై ఆసక్తి చూపించలేదని ఇంటర్వ్యూలో చెప్పింది రష్మి. అయితే `గుంటూరు టాకీస్‌` మంచి పేరే తెచ్చినా సరైనా ఆఫర్లు రాలేదు. దీంతో `జబర్దస్త్`కే పరిమితమయ్యింది. అదే ఆమెకిస్టార్‌ యాంకర్‌ ఇమేజ్‌ని తెచ్చింది. మంచి  ఫాలోయింగ్‌ని,ఫ్యాన్‌ బేస్‌ని తీసుకొచ్చింది. 

88

ఇప్పుడు మళ్లీ సినిమాప్రయత్నాలు చేస్తుంది. ఆ మధ్య `భోళా శంకర్‌`లో ఐటెమ్‌ గర్ల్ గా మెరిసింది. ఇప్పుడు కూడా ఆమె గ్లామర్‌ పాత్రలు, ఐటెమ్‌ సాంగ్‌లు చేసేందుకు రెడీగా ఉంది. మరి మేకర్స్ ఎంకరేజ్‌ చేస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం రష్మి `జబర్దస్త్` షోతోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకర్‌గా చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories