Malaikottai Vaaliban Ott : ఓటీటీలోకి మోహనన్ లాల్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published : Feb 18, 2024, 06:23 PM IST

ఓటీటీలోకి స్టార్ నటుడు మోహన్ లాల్ (Malayalam Star Mohan Lal) రీసెంట్ మూవీ రానుంది. తాజాగా స్ట్రీమింగ్ పార్ట్ నర్, రిలీజ్ డేట్ వివరాలు అందాయి. ఈ మూవీ ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందంటే... 

PREV
16
Malaikottai Vaaliban Ott : ఓటీటీలోకి మోహనన్ లాల్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మలయాళం స్టార్ మోహన్ లాల్ (Mohan Lal)  తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. ఆయన సినిమాలను ఇక్కడి ప్రేక్షకులకు కూడా ఆదరిస్తుంటారు. కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు కూడాను. 
 

26

తాజాగా ఆయన నుంచి ఓ కొత్త సినిమా వచ్చింది. చివరిగా రజినీకాంత్ (Rajinikanth) ‘జైలర్’ (Jailer)లో గెస్ట్ రోల్ లో అలరించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మలైకొట్టై వాలిబన్ (Malaikottai Vaaliban) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

36

ఈ చిత్రం గత నెల 25 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ పెద్దగా ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. రూ.70 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం కనీసం అందులో సగం బడ్జెట్ ను కూడా తిరిగి రాట్టలేకపోయింది. 

46

కానీ ఈ చిత్రంలో మోహన్ లాల్ పోరాట యోధుడిగా అలరించారు. ఆయన నటన ఆకట్టుకుంది. ఇండిపెండెన్స్ కు ముందుకు బ్రిటీషర్ల కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం తెరకెక్కింది. మల్ల యోధుడిగా మోహన్ లాల్ అలరించారు. 

56

అయితే ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసింది. దీంతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 23న ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar)లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకా ఐదురోజుల్లో అందుబాటులోకి రానుంది. 

66

మోహన్ లాల్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమా ఇక్కడి ఆడియెన్స్ లోనూ ఆసక్తి నెలకొప్పింది. తెలుగు వెర్షన్ లోనూ చిత్రం విడుదల కాతోతుండటంతో ఖుషి అవుతున్నారు. ఈ చిత్రానికి లిజో జోస్ పెలిసరి దర్శకత్వం వహించారు. 

Read more Photos on
click me!

Recommended Stories