బాలీవుడ్ నటి రవీనా టండన్ 30 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నారు. 90 నుంచే సినిమాలు చేస్తూ వచ్చారు. హిందీ చిత్రాలతో పాటు టీవీ షోల్లోనూ మెరిసింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. స్టార్స్ సరసన ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఇక తెలుగులోనూ ఈ సీనియర్ నటి ఆయా చిత్రాల్లో నటించింది. 90లలోనే ‘రథ సారథి’, ‘బంగారు బుల్లోడు’, ‘ఆకాశ వీధిలో’, ‘పాండవులు పాండవులు తుమ్మేద’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. పెద్దగా తెలుగు చిత్రాలతో ఫేమ్ దక్కించుకోలేదు.
కన్నడ చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ (KGF Chapter 2)తో రవీనా టండన్ పేరు దక్షిణాదిలోనూ మారుమోగిన విషయం తెలిసిందే. ఆమె నటనకు, దూకుడుగా వ్యవహరించిన తీరుకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. తన పెర్ఫామెన్స్ కు ప్రశంసలు దక్కించుకుంది.
ఆ తర్వాత నుంచి రవీనా టండన్ పేరు సోషల్ మీడియాలో మాత్రం మారుమోగుతోంది. పలు యాడ్ షూట్లలో నటిస్తూ ఆకట్టుకుంటోంది. నెట్టింట కూడా ఈ సీనియర్ నటి స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లతో ఆకట్టుకుంటోంది.
తాజాగా ఓ మ్యాగజైన్ కోసం చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. ఫెమినా ఇండియా అనే మ్యాగజైన్ కోసం రవీనా ట్రెండీ లుక్ లో మెరిసింది. అదిరిపోయే ఫిట్ నెస్ కు తోడు ఆకర్షించే అవుట్ ఫిట్ తో అట్రాక్ట్ చేసింది.
దాదాపు 50 ఏళ్ల వయస్సులోనూ రవీనా టండన్ ఈ రేంజ్ లో ఫొటోలకు ఫోజులివ్వడం ఆసక్తికరంగా మారింది. ఆమె అందాల ప్రదర్శనకు, అదిరిపోయే స్టిల్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. యంగ్ బ్యూటీలకు షాకిచ్చేలా ఫొటోషూట్లు చేస్తుండటం హాట్ టాపిక్ గ్గా మారింది.
ఫొటోలకు ఫోజులివ్వడమే కాకుండా గ్లామర్ మెరుపులతోనూ మెస్మరైజ్ చేసింది. 49 ఏళ్ల వయస్సులోనూ రవీనా టండన్ బ్రా లేకుండా టాప్ గ్లామర్ విందు చేస్తూ ఫొటోషూట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఈ ముదురు భామకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మొత్తానికి రవీనా టండన్ లేటెస్ట్ లుక్ ను నెటిజన్లు, అభిమానులు పొగడుతున్నారు. బాలీవుడ్ నటిని మరింతగా ఎంకరేజ్ చేస్తూ ఆకాశానికి ఎత్తుతున్నారు.