రష్మీకి చెప్పడకుండా పెళ్ళికి సిద్దమైన సుధీర్... విషయం తెలుసుకొని కన్నీరు పెట్టుకున్న యాంకర్

First Published Mar 20, 2021, 8:03 AM IST

బుల్లితెర ప్రేమజంట సుధీర్, రష్మీ గౌతమ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేర్లు. చాలా కాలంగా బుల్లితెరపై వీరిద్దరూ అలరిస్తున్నారు. జబర్ధస్త్ వేదికపై మొదలైన వీరి రొమాన్స్.. ఢీ షో వరకు పాకింది.

ప్రోగ్రాం ఏదైనా సుధీర్, రష్మీ కలిసి ఓ రొమాంటిక్ సాంగ్ చేసినా... స్కిట్ చేసినా ప్రేక్షకులకు ఆ కిక్కే వేరు. సుధీర్, రష్మిలను జంటగా చూడడానికి చాలా మంది ఇష్టపడతారు.
undefined
సుధీర్, రష్మీల మధ్య ఘాడమైన ప్రేమ ఉందని, వీరు పెళ్లి కూడా చేసుకోవడం ఖాయం అని చాలా కాలంగా పుకార్లు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాలలో మేము స్నేహితులం మాత్రమే అని వీరు చెప్పిన సంగతి తెలిసిందే.
undefined
మరి సుధీర్ నాకు మిత్రుడు మాత్రమే అంటున్న... రష్మీ మాత్రం సుధీర్ పెళ్లి విషయం తెలిసి కన్నీరు పెట్టుకున్నారు.
undefined
సుధీర్ ప్లే బాయ్ అని అందరికీ తెలుసు... అందుకే ఎవరికీ తెలియకుండా, ఫ్రెండ్స్ ని కూడా పిలవకుండా తన పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాడట.
undefined
ఈ విషయం తెలుసుకున్న సుధీర్ బెస్ట్ ఫ్రెండ్స్ రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను మొదట షాక్ అయ్యారు. ఆ తరువాత రష్మీకి తెలియకుండా వీడు పెళ్లి ఎలా చేసుకుంటాడని ఆగ్రహానికి గురయ్యారు.
undefined
సుధీర్ ఎదుగుదలకు కారణమైన రష్మీని పెళ్ళికి పిలిచి.. అతని పెళ్లి చెడగొట్టాలని ప్లాన్ వేశారు. సుధీర్ పెళ్లి వేడుకకు రష్మీ రావడంతో పాటు, అతనికి కంగ్రాట్స్ చెప్పింది.
undefined
అదే సమయంలో ఆమె సుధీర్ పెళ్లి చెడగొట్టాలని పెళ్లి కూతురు తరపు వాళ్లకు తెలిసేలా... కన్నీరు పెట్టుకున్నారు. అలా రష్మీ, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కలిసి సుధీర్ పెళ్లి చెడగొట్టాలనే ప్రయత్నం చేశారు.
undefined
ఈ వ్యవహారం అంతా జబర్ధస్త్ స్కిట్ కోసమే అని ఇప్పటికే మీకు అర్ధమయ్యే ఉంటుంది. సుధీర్ నిజంగా పెళ్లి చేసుకుంటే రష్మీ ఎలా ఫీలవుతుందో తాజా స్కిట్ లో ఫన్నీగా చెప్పారు.
undefined
వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమోలో ఈ ఆసక్తికర సంగతులు పొందుపరచి ఉన్నాయి. నవ్వులు పూయించడం కోసం రష్మీ, సుధీర్ స్కిట్ లో భాగమయ్యారు.
undefined
click me!