దీపికా పదుకొనెతో విడిపోతున్న రణ్వీర్ సింగ్... క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ 

Published : Sep 30, 2022, 02:09 PM ISTUpdated : Sep 30, 2022, 04:24 PM IST

ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమర్ సంధు చేసిన ఓ ట్వీట్ బాలీవుడ్ లో సంచలనం రేపింది.బాలీవుడ్ కపుల్ రణ్వీర్ సింగ్-దీపికా మధ్య మనస్పర్థలు వచ్చాయి. వారి విడిపోతారని అర్థం వచ్చేలా ఆయన చేసిన కామెంట్ పలు మీడియా కథనాలకు కారణమైంది.   

PREV
16
దీపికా పదుకొనెతో విడిపోతున్న రణ్వీర్ సింగ్... క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ 
Ranveer Singh-Deeepika Padukone

బాలీవుడ్ క్రేజీ కపుల్ రణ్వీర్-దీపికా విడిపోతున్నారంటూ రెండు రోజులుగా బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తాయని, ఇక కలిసి ఉండడం కుదరదని డిసైడైన బార్యాభర్తలు విడాకులు సిద్దమయ్యారనేది సదరు కథనాల సారాంశం. 
 

26
Ranveer Singh-Deeepika Padukone


ఈ పుకార్లకు ఓ ట్వీట్ ఆజ్యం పోసింది. వివాదాస్పద క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమర్ సంధు... దీపికా పదుకొనె-రణ్వీర్ సింగ్ మధ్య పరిస్థితులు సవ్యంగా లేవు. వారికి గొడవలు జరుగుతున్నాయి. విడిపోవచ్చని అర్థం వచ్చేలా ఓ ట్వీట్ వేశాడు. తాను ఆ కామెంట్ చేయడానికి ఆధారం ఏమిటో తెలియదు. ఆ ట్వీట్ ఆధారంగా బాలీవుడ్ లో అనేక కథనాలు పుట్టుకొచ్చాయి. 

36
Ranveer Singh-Deeepika Padukone


ఈ క్రమంలో రణ్వీర్ సింగ్ స్పందించారు. ఆయన మీడియాతో ముఖంగా విడాకుల వార్తలు ఖండించారు. 2012 లో దీపికాతో నాకు ప్రేమ మొదలైంది. ఇప్పుడు 2022 అంటే 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ పదేళ్లలో ఆమెపై ప్రేమ మరింత పెరిగింది. ఆమెను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. దీపికా నాకు దొరికిన అదృష్ట దేవత. ఆమెను ఎన్నటికీ వదులుకోను అని క్లారిటీ ఇచ్చారు. 

46
Ranveer Singh-Deeepika Padukone


దీంతో రణ్వీర్-దీపికా విడాకుల రూమర్స్ వీగిపోయాయి. 2018 లో రణ్వీర్-దీపికా వివాహం చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్ళ సంసారం జీవితం పూర్తి చేశారు. ఎన్నడూ వీరి మధ్య మనస్పర్థలు తలెత్తిన దాఖలు లేవు. జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్స్ లో ఈ జంట కలిసి పాల్గొంటారు. 

56
Ranveer Singh-Deeepika Padukone


ప్రస్తుతం ఇద్దరూ తమ తమ వృత్తుల్లో బిజీగా ఉన్నారు. దీపికా ప్రభాస్ ప్రాజెక్ట్ కె, షారుక్ ఖాన్ పఠాన్, జవాన్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే భర్త రణ్వీర్ హీరోగా తెరకెక్కుతున్న సర్కస్ మూవీలో నటిస్తుంది. అలాగే రణ్వీర్ సర్కస్, రాఖి ఔర్ రాణి కి ప్రేమ్ కహాని చిత్రాల్లో నటిస్తున్నారు. 

66

కొన్నాళ్లుగా దీపికా పదుకొనె మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుండగా ప్రాజెక్ట్ కే సెట్స్ లో దీపికా సడన్ గా పడిపోయారు. అలాగే కొద్ది రోజుల క్రితం ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా దీపిక ఆరోగ్యం పాడైందనే ఓ వాదన ఉంది. అయితే ఈ వాదనను కొందరు కొట్టిపారేస్తున్నారు. ఆమె గర్భవతి అయ్యారంటూ కూడా కథనాలు వెలువడ్డాయి.

Read more Photos on
click me!

Recommended Stories