తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కాజల్ సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు ఎక్కువగా టచ్ లో ఉంటోంది. తన మ్యారేజ్, ప్రెగ్నెన్సీకి సంబంధించిన వివరాలను కూడా నెట్టింట్లోనే పంచుకుంది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ బ్యూటీ.. ఇక కేరీర్ పై మళ్లీ ఫోకస్ పెట్టేందుకు సిద్ధమైంది.