Devatha: రాధకు మాటిచ్చిన రామ్మూర్తి! జానకమ్మకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన మాధవ?

First Published Sep 30, 2022, 12:00 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 30వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..రాధ,చిన్మయి ని లోపలికి వెళ్లి చదువుకోమని చెప్పి జానకమ్మకు జావ తాగిపిస్తుంది. అప్పుడు రామ్ మూర్తి, రాధతో, నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదమ్మా.ఏ సంబంధం లేకపోయినా మా మనవరాలుని సొంత కూతురులా చూసి తనకి జీవితాన్ని ప్రసాదించావు ఇంట్లో వాళ్లకి ఇన్ని సేవలు చేశావు.నిన్ను ఆ దేవుడే పంపించారు అని అనగా రాద,నేను చేసింది ఏముంది నా బిడ్డతో నేను ఏ దిక్కు లేకుండా ఉన్నప్పుడు మీరే నాకు ఇల్లు నిచ్చారు, వసతినిచ్చారు. ఈ రుణం ఎలా తీర్చుకుందామా అనుకున్నాను.
 

 దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు అని రాధ అనగా, రామ్ మూర్తి, నీకేం కావాలో కోరుకో అమ్మ నేను నెరవేరుస్తాను అని అంటాడు. అప్పుడు రాద నాకు ఇప్పుడు కోరికలు ఏమీ లేవు నిజంగా నాకు ఏమైనా అవసరం ఉన్నది అంటే నేను మిమ్మల్ని అడుగుతాను అని అంటుంది. అప్పుడు రామ్ మూర్తి రాధతో, నువ్వేం అడిగినా నేను తీరుస్తాను అని నీకు మాట ఇస్తున్నాను అని అంటాడు. ఆ తర్వాత సీన్లో ఆదిత్య,దేవి ఇద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు.అప్పుడు దారిలో దేవి ఆదిత్యతో, ఆఫీసర్ సారు మా నానమ్మకు ఎలాగైనా తగ్గేలా చూడండి ఇంట్లో అందరూ చాలా కంగారుగా ఉన్నారు. 
 

అమ్మ సేవలు చేస్తూనే ఉన్నది, తాత చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు అని అనగా మనం వెళ్తున్నాం కదా డాక్టర్ గారు చూస్తారు ఏం కంగారు పడొద్దు తగ్గిపోతుంది అని అంటాడు ఆదిత్య. ఆ తర్వాత సీన్లో రాధ జానకమ్మ కి జ్యూస్ ఇవ్వడానికి వెళుతుంది.అప్పుడు జానకమ్మ రాద తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు రాద,మీరు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ నాకు అది ఏంటో అర్థం అవ్వట్లేదు అని అంటుంది. ఇది చూసిన చిన్మయి,వెళ్లి కాగితము, పెన్ను తెచ్చి నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావో అది కాగితంలో రాయి నానమ్మ అని అంటుంది.
 

 అప్పుడు రాద ఈ ఆలోచన కూడా బానే ఉంది కదా అని అనగా అంతలో మాధవ్ అక్కడికి వచ్చి ఎందుకు అమ్మని ఊరికే ఇబ్బంది పెడతారు. మాట్లాడడమే కష్టమంటే ఇప్పుడు రాయడం ఎందుకు అని అంటాడు. అప్పుడు చిన్మయి, ఏదో చెప్పాలనుకుంటుంది రాయనివ్వండి అని పెన్ను, పేపర్ జానకమ్మకి ఇవ్వగా జానకమ్మ రాయడానికి ప్రయత్నించి రాయలేక పోతుంది. అప్పుడు మాధవ్ మనసులో ఆనందపడతాడు. ఇంతలో డాక్టర్ వచ్చి జానకమ్మని చెక్ చేసి ఈవిడకి నయమవుతుంది వారంలో ఫలితం దక్కుతుంది నేను ట్రీట్మెంట్ చేస్తాను అని అనగా ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడతారు.
 

అప్పుడు మాధవ్ మనసులో చాలా భయపడతాడు. ఆ తర్వాత సీన్లో, సత్య జరిగిన విషమంతా గుర్తు తెచ్చుకొని, అక్క ఇంక ఆదిత్య కి నాకు మధ్య దూరం రాకుండా చేస్తానన్నది మళ్ళీ నిన్న దేవిని తీసుకువచ్చింది అని అనుకుంటుంది. ఇంతలో దేవుడమ్మ వాడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నా సత్య అనగా, జానకమ్మ గారికి డాక్టర్ని తేవాలంటే చాలామంది ఉన్నారు కదా ఆంటీ ఆదిత్యనే ఎందుకు అడగాలి అని అడుగుతుంది. అలా అంటావ్ ఏంటి సత్య వాళ్లు మనకి ఎన్నోసార్లు సహాయం చేశారు కదా.
 

 మనం కూడా వాళ్ళకి రుణపడి ఉంటాము అని అనగా, అందుకనే మొన్న మనం వాళ్ళని వెళ్లి పలకరించి వచ్చాను కదా ఆంటీ అని సత్య అంటుంది. అలా కాదు సత్య ఒక మనిషికి ఇంకొకరు సహాయం చేసుకుంటూ ఉంటేనే అనుబంధాలు బాగుంటాయి దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు సత్య మనసులో, నేను చెప్తుంది మీకు అర్థం అవడం లేదు ఆంటీ అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో జానకమ్మ ఒక్కతే ఉన్నప్పుడు మాధవ్ అక్కడికి వచ్చి,ఆదిత్య ఎవరో పెద్ద డాక్టర్ని తీసుకువచ్చాడు కదా!
 

వారంలో నయమైపోతుంది అంటున్నారు. నీకు సంతోషమే కదా హాయిగా ఉన్నావు. నా గురించి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి నన్ను శిక్షించి, రాదని దేవిని ఇక్కడి నుంచి పంపిద్దాం అనుకుంటున్నావు కదా! నేను అలా జరగనిస్తాను అని నువ్వు అనుకుంటున్నావా! తల్లంటే పిల్లలు చేసే తప్పులను క్షమించుకుంటూ వెళ్ళాలి. కానీ పిల్లలని శిక్షించకూడదు. మొన్న నిన్ను మెట్ల మీద నుంచి పడేసినట్టే ఇప్పుడు కూడా నాకు ఆ అవకాశం ఉంది.కానీ నేను అలా చేయను ఎందుకంటే నాలో కూడా ఎంతో కొంత మంచితనం ఉన్నది అని అంటాడు మాధవ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!