Dhurandhar 2 Trailer: ఆ ఒక్క కారణంతో 'ధురంధర్ 2' ట్రైలర్ వాయిదా.. అసలు విషయం ఇదే!

Published : Mar 04, 2026, 09:29 PM IST

ధురంధర్ 2 ట్రైలర్ లాంచ్‌పై వస్తున్న ఊహాగానాలు ఒక్కసారిగా కొత్త మలుపు తీసుకున్నాయి. మొదట పుకార్లుగా కొట్టిపారేసినా, ఇప్పుడు దీని వెనుక ఓ సాంస్కృతిక కారణం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మేకర్స్ ట్రైలర్ రిలీజ్‌ను వాయిదా వేసినట్లు సమాచారం.

PREV
13
Trailer Postponed Amid Chandra Grahan Buzz
రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' ట్రైలర్‌ను మార్చి 3, 2026న రిలీజ్ చేయాలని మొదట ప్లాన్ చేశారు. కానీ అదే రోజు మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు చంద్రగ్రహణం ఉండటంతో, మేకర్స్ ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు టాక్. శుభకార్యాలకు గ్రహణం మంచిది కాదనే నమ్మకంతో ట్రైలర్‌ను వాయిదా వేశారు. ఇప్పుడు మార్చి 5 లేదా 6న డిజిటల్‌గా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
23
'ధురంధర్'కు సీక్వెల్‌
బ్లాక్‌బస్టర్ 'ధురంధర్'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నారు. 'ధురంధర్ 2'ను మార్చి 19, 2026న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమా టీజర్‌కు 'A' సర్టిఫికెట్ ఇచ్చింది. 1 నిమిషం 48 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్, సినిమా ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతుందో చెప్పకనే చెబుతోంది.
33
మార్చి 19న బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే
మార్చి 19న బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరగనుంది. 'ధురంధర్ 2'తో పాటు యశ్ నటిస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్', అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న 'డెకాయిట్' కూడా అదే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలో రణ్‌వీర్‌తో పాటు ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యామీ గౌతమ్ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నట్లు టాక్.
Read more Photos on
click me!

Recommended Stories