Vijay Rashmika Wedding Cost: విజయ్‌, రష్మిక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? టాలీవుడ్‌లోనే ఖరీదైన మ్యారేజ్‌

Published : Mar 04, 2026, 08:11 PM IST

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా ఇటీవలే మ్యారేజ్‌ చేసుకున్నారు. ఇప్పుడు గ్రాండ్‌గా రిసెప్షన్‌ జరుగుతుంది. ఈ సందర్భంగా వీరి పెళ్లికి ఎంత ఖర్చు వచ్చిందనేది చూస్తే మతిపోవాల్సిందే. 

PREV
16
ఒక సెలబ్రేషన్‌లా విజయ్‌, రష్మిక పెళ్లి

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా ఎట్టకేలకు మ్యారేజ్‌ చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. రాజులను తలపించేలా వీరి పెళ్లి జరగడం విశేషం. అతికొద్ది మంది బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. అంతా వీరి మ్యారేజ్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. మ్యారేజ్‌ చేసుకున్న తీరు, ఆ కల్చర్‌, ధరించిన నగలు గురించిన చర్చ జరిగింది. దీంతోపాటు తన సొంతూరు వ్రతం చేయడం, ఆ తర్వాత సంగీత్‌ కార్యక్రమం నిర్వహించడం ఇలా అంతా ఒక సెలబ్రేషన్‌లా సాగింది.

26
విరోష్‌ వెడ్డింగ్‌కి ఖర్చు ఎంత?

దాదాపు వారం రోజులుగా వీరి మ్యారేజ్‌ కి సంబంధించిన హడావుడినే జరుగుతుంది. మిగిలిన అన్నీ పక్కకు వెళ్లాయని చెప్పొచ్చు. అంతగా చర్చనీయాంశంగా మారిన విజయ్‌ దేవరకొండ, రష్మిక (విరోష్‌) వెడ్డింగ్‌ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. దీనికి ఎంత ఖర్చు అయ్యిందనేది ఆసక్తికరంగా మారింది. ఇంత గ్రాండ్‌గా చేసుకున్నారు కదా, ఎంత ఖర్చు చేశారని అంతా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో తమ పెళ్లికోసం విరోష్‌ జంట ఎంత ఖర్చు చేశారనేది చూస్తే.

36
రూ.20కోట్లతో విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా తమ పెళ్లి కోసం ఏకంగా రూ.20కోట్లు ఖర్చు చేశారట. పెళ్లి షాపింగ్‌ నుంచి, ఉదయ్‌ పూర్‌లో మ్యారేజ్‌, సొంతూరులో వ్రతం, ఊరి జనాలకు విందు భోజనం, ఆ తర్వాత సంగీత్‌ పార్టీ, అనంతరం అభిమానుల మీట్‌,  ఫైనల్‌గా ఇప్పుడు జరుగుతున్న రిసెప్షన్‌ ఇలా అన్ని కలుపుకొని దాదాపు ఇరవై కోట్ల వరకు ఖర్చు అయ్యిందని తెలుస్తోంది. షాపింగ్‌, గోల్డ్ కాస్ట్ ఇలా అన్నీ ఇంత ఖర్చు వచ్చిందని టాక్‌. తమ పెళ్లికి విజయ్‌, రష్మిక ఏకంగా మూడు కేజీల బంగారం ధరించారట. రష్మిక రెండు కేజీలు, విజయ్‌ కేజీ వరకు బంగారు అభరణాలు చేయించుకున్నట్టు టాక్‌.

46
టాలీవుడ్‌లోనే అత్యంత ఖరీదైన పెళ్లి విరోష్‌ వెడ్డింగ్‌

అయితే ఈ పెళ్లి విషయంలో రష్మిక మందన్నా, అటు విజయ్‌ దేవరకొండ ఇద్దరూ ఈ ఖర్చుని షేర్‌ చేసుకున్నారట. తమ మ్యారేజ్‌ నిర్వాహణకు సంబంధించిన ఒక ఈవెంట్‌ కంపెనీ అన్నీ చూసుకుందని సమాచారం. ఇప్పుడు విజయ్‌, రష్మిక పెళ్లి టాలీవుడ్‌లోనే అత్యంత ఖరీదైన మ్యారేజ్‌గా నిలిచింది. ఎందుకంటే ఈ స్థాయిలో మరే హీరో ఖర్చు చేయలేదు. ఆ మధ్య నాగచైతన్య, సమంత పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. దాని ఖర్చు పది కోట్లు అని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఆ స్థాయిలో మరే సెలబ్రిటీ పెళ్లి జరగలేదు. ఇప్పుడు విజయ్‌, రష్మిక దాన్ని మించి ఒక సెలబ్రేషన్‌ లా మ్యారేజ్‌ చేసుకోవడం విశేషం. 

56
పాన్‌ ఇండియా స్టార్స్ గా రాణిస్తోన్న విజయ్‌, రష్మిక

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరూ సినిమా రంగంలోనే ఉన్నారు. నటులుగా బిజీగా ఉన్నారు. ఇద్దరూ పాన్‌ ఇండియా మూవీస్‌ చేస్తున్నారు. రష్మిక నేషనల్‌ వైడ్‌గా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. విజయ్‌ దేవరకొండ పాన్‌ ఇండియా హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రెండు భారీ పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తున్నారు.

66
రష్మిక మందన్నానే మొదట ప్రపోజ్‌ చేసింది- విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా మొదటిసారి `గీత గోవిందం` చిత్రంలో నటించారు. ఆ సమయంలో ఇద్దరు క్లోజ్‌ అయ్యారు. అప్పటికీ ప్రేమ స్టార్ట్ కాలేదు. మంచి స్నేహితులుగానే ఉన్నారు. కానీ `డియర్‌ కామ్రేడ్‌` చేసే సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారట. మొదట రష్మికనే తనకు ప్రపోజ్‌ చేసిందని తెలిపారు విజయ్‌. అభిమానులతో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నారు. ఆ తర్వాత తాను కూడా ఎస్‌ చెప్పడం, ఆ ప్రేమని ఇన్నాళ్లు రహస్యంగా ఉంచారు. ఇప్పుడు పెళ్లితో ఓపెన్‌ చేశారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories