Ustaad Bhagat Singh: మొన్న పుష్ప 2, నేడు ఉస్తాద్.. పాపం దేవిశ్రీ ప్రసాద్ బీజీయం పంచాయతీ ఏంటి..?

Published : Mar 04, 2026, 08:48 PM IST

పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయంలో ఆసక్తికర ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. కానీ తాజాగా తమన్ కూడానా జాయిన్ అయ్యారు. 

PREV
15
గబ్బర్ సింగ్ కాంబినేషన్

గబ్బర్ సింగ్ త్రయం పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మార్చి 26న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అన్నీ కుదిరితే ఇంకా ముందుగానే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

25
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ప్రకటన

దీనితో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి ఒక ఆసక్తికర వార్త అభిమానులని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీ అయినప్పటికీ.. బీజీయం మాత్రం తమన్ అందించబోతున్నారు. చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

35
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ - తమన్ ఎంట్రీ

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో త్వరగా బిజీయం పూర్తి చేయడానికి తమన్ కి బాధ్యతలు అప్పగించారు. దేవిశ్రీ ప్రసాద్ విషయంలో ఇలా జరగడం రెండోసారి. అది కూడా మైత్రి మూవీస్ బ్యానర్ లోనే. గతంలో పుష్ప 2 చిత్రానికి కూడా ఇలాగే జరిగింది. పుష్ప 2 సినిమాకి దేవిశ్రీ పాటలు అందించారు. సుకుమార్, దేవిశ్రీ మధ్య మంచి అనుబంధం కూడా ఉంది.

45
బీజీయం కోసం తమన్

కానీ చివరి నిమిషంలో బీజీయంకి తమన్, అంజనీష్ లోక్ నాథ్, సామ్ సిఎస్ లాంటి వారిని తీసుకున్నారు. మైత్రి నిర్మాతలతో దేవిశ్రీకి విభేదాలు ఏర్పడ్డాయి. ఓపెన్ గానే ఓ ఈవెంట్ లో దేవిశ్రీ తన అసహనాన్ని నిర్మాతలపై బయట పెట్టడం వివాదంగా మారింది. అయితే ఆ తర్వాత వివాదం సమసిపోయింది.

55
పుష్ప 2 తర్వాత మరోసారి

కానీ ఇప్పుడు మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయంలో దేవిశ్రీ వార్తల్లో నిలిచారు. ఈ చిత్రానికి బీజీయం తమన్ అందించబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం వల్ల టైంకి బీజీయం అందించే వీలు లేకుండా పోయింది. దీనితో తమన్ బీజీయం అందించబోతున్నారు. ఎంతో గౌరవంగా, అంతా కలసి చర్చించి తీసుకున్న నిర్ణయం ఇది అని మైత్రి సంస్థ తెలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories