ఆలియా భట్ ఇతర హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పై.. రణ్ బీర్ కపూర్ కామెంట్స్ ఏంటంటే..?

Published : Aug 02, 2024, 11:16 AM IST

చాలా చిన్నవయస్సులో  పెళ్లి చేసుకున్నారు ఆలియా భట్.. రణ్ బీర్ కపూర్. పెళ్ళి తరువాత కూడా హీరోయిన్ గా కొనసాగుతోంది ఆలియా.. ఇతర హీరోలతో ఆలియా రొమాన్స్ చేస్తే.. రణ్ బీర్ కపూర్ స్పందన ఏంటి..?

PREV
16
ఆలియా భట్ ఇతర హీరోలతో ఆన్ స్క్రీన్  రొమాన్స్ పై.. రణ్ బీర్ కపూర్ కామెంట్స్ ఏంటంటే..?

బాలీవుడ్‌లోని క్యూట్ కపుల్ అనగానే ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ జంట కనిపిస్తారు. దాదాపు 5 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు... వెంటనే ఓ ఆడపిల్లకు తల్లీ తండ్రులు కూడా అయ్యారు. పెళ్ళి తరువాత కూడా హీరోయిన్ గా కొనసాగుతోంది ఆలియాభట్. అయితే హీరోయిన్ గా తన  భార్య అలియా భట్ ఇతర నటీనటులతో సినిమాలో రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అని రణబీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాట వెల్లడించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? 

26
Ranbir Kapoor, Alia Bhatt

 రణబీర్ కపూర్ పదేళ్ల క్రితం ఎలా ఉన్నాడో మరియు ఇప్పుడు ఎలా ఉన్నాడో వివరించాడు. అతని ప్రకారం పదేళ్ల క్రితం రణబీర్ ఆలోచనలో పరిపక్వత లేదట. ఇదివరకు రణ్ బీర్ కపూర్ లో అభద్రతా భావం ఉండేద. తన ప్రోఫిషన్ తో పాటు.. ఆలియా భట్ హీరోయిన్ గా కొనసాగితే ఎలా అని భయం ఉండేదట. కాని ఇప్పుడు తనలో మార్పు వచ్చిందని. . చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించగలుగుతున్నాను అన్నారు. 

36

నేను అనుమానపు భర్తను కాను అని  రణబీర్ కపూర్ అన్నారు. నేను పదేళ్ల క్రితం లాగా లేను. నా పనిలో కూడా నాకు అభద్రతా భావం లేదు. అలియా విషయంలోనూ అంతే. ఆలియా సినిమాల్లో ఇతర హీరోలతో రొమాన్స్ చేస్తే.. పదేళ్ల క్రితం రణ్ బీర్ ను అయి ఉంటే.. .సేఫ్ గా ఫీల్ అయ్యేవాడిని కానేమో.. కాని  నేను ఇప్పుడు పెద్దవాడిని. జీవితాన్ని అర్థవంతంగా గడుపుతున్నాను అని రణబీర్ కపూర్ అన్నారు. 

46

ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ కూడా తన సినిమాల గురించి చాలా మాట్లాడాడు. రణబీర్ కపూర్ మొదటి సినిమా సావరియా. ఈ సినిమా  ప్లాప్ టాక్ తెచ్చుకుంది.  ఈ విషయమై రణ్‌బీర్‌ కపూర్‌ మాట్లాడుతూ.. సావరియా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. సినిమా ఫ్లాప్ అయింది. కానీ అది నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. అలాంటి విషయంలో ఎలా వ్యవహరించాలో నాకు తెలుసు అని రణబీర్ అన్నాడు.

56
Image: Our Own

ఇక నటిగా.. భార్యగా ఆలియా భట్ ను రణబీర్ కపూర్  ప్రశంసించారు. పెళ్లయ్యాక భర్త గురించే ఆలోచించే ఆలియా.. తన స్వభావాన్ని మార్చుకుంది. అందుకే  రణబీర్ చాలా రిలాక్స్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. రణ్ బీర్ కపూర్ ఇంకా ఏమన్నారంటే.. నేను ఆమె కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను.  తను  నాకోసం చాలా త్యాగం చేసిందని అన్నారు రణబీర్. 
 

66
Ranbir Kapoor, Alia Bhatt

గతంలో తాను పెద్దగా మాట్లాడేది.. కాని  అలియా నా కోసం తన స్వరం మార్చింది. 30 ఏళ్ల స్వభావాన్ని, జీవన విధానాన్ని మార్చుకోవడం అంత సులువు కాదు.  కాని నా కోసం అలియా  ఆ పని చేసిందని రణబీర్ చెప్పాడు. అలియా మరియు రణబీర్ ఏప్రిల్ 14, 2022 న వివాహం చేసుకోనున్నారు. వారికి రాహా అనే రెండేళ్ల అందమైన కూతురు కూడా ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories