ప్రభాస్ తన డబ్బుంతా ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడో తెలుసా?

First Published | Aug 2, 2024, 10:12 AM IST

ప్రభాస్ మార్కెట్ ఇప్పుడు వెయ్యి కోట్లు దాటేసింది. దాంతో పాటే ఆయన రెమ్యునరేషన్ సైతం రెట్లుగా పెరుగుతోంది. మరి ఆడబ్బుంతా ఏం చేస్తున్నారు.

kalki 2898


ఇండియాలో ఉన్న టాప్ హీరోల్లో ఒకరుగా ప్రభాస్ అవతరించారు. ‘బాహుబలి’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas) స్టార్‌డమ్‌ పెరగటమే తప్పించి వెనకడుగే లేదు. ఆదిపురుష్ లాంటి డిజాస్టర్స్ సైతం ప్రబాస్ ఇమేజ్ కొంచెం కూడా తగ్గించలేకపోయాయి. వరస పెట్టి సలార్, కల్కి చిత్రాలతో ఆయన క్రేజ్ ఏ రేంజ్‌కు చేరుకుందో తెలిసిందే. బాహుబలి రెండు పార్ట్ లు హ్యూజ్ సక్సెస్ తో   ప్రభాస్  మార్కెట్ పరిధులను కూడా విస్తరించి ఆ తర్వాత వచ్చిన అనేక సినిమాలకు దారి చూపింది.  ఈ క్రమంలో ప్రభాస్ రెమ్యునరేషన్ పెరిగిపోయింది. తద్వారా ఆదాయం పెరిగింది. మరి ఆ డబ్బంతా ప్రభాస్ ఏం చేస్తున్నారు. 
 

actor Prabhas movie


బాహుబలి తర్వాత చేసిన ‘సాహో, రాధేశ్యామ్’ చిత్రాలు సక్సెస్ విషయం ప్రక్కన పెడితే.. ఇండియా వైడ్‌గా తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇదే క్రమంలో కేజీఎఫ్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలుతో నెక్ట్స్ లెవిల్ కు వెళ్లాయి. ఇప్పుడు  మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇవే గాక సీతారామమ్ దర్శకుడు హను రాఘవపూడితో ప్రభాస్ జతకట్టబోతున్నట్లు తెలుస్తుండగా.. ఈ ప్రాజెక్ట్‌ కోసం తను తీసుకునే రెమ్యునరేషన్ (Remuneration) వివరాలు షాక్ ఇస్తున్నాయి.
 

Latest Videos



 రెండేళ్ల నుంచి ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్..హను రాఘవపూడి  సినిమాతో పాటు భవిష్యత్తులో సైన్ చేయబోయే సినిమాల కోసం రెమ్యునరేషన్‌ను పెంచాడని టాక్ వినిపిస్తోంది.ప్రభాస్ తన ఒక్కో సినిమాకు రూ.  200 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకోనున్నాడని సమాచారం. నిజానికి ప్రభాస్‌కు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మార్కెట్ ఉన్నందున తను కోట్ చేసిన మొత్తం చెల్లించేందుకు మేకర్స్ సైతం సిద్ధంగా ఉన్నట్లు వినికిడి.
 


ఇలా లెక్కలు మించి వస్తున్న డబ్బుని ప్రభాస్ ఏమి చేస్తున్నారు. ఎంత ఖర్చు పెడితే మాత్రం అవుతుంది. ప్రభాస్ లైఫ్ స్టైల్  చాలా లావిష్ గా ఉంటుందని చెప్తారు. ఆయన తన స్నేహితుల కోసం, కుటుంబ సబ్యుల కోసం కోట్లు ఖర్చుపెడతారు. అలాగే ఇండియాలో బెస్ట్ హోస్ట్ లలో ప్రబాస్ ఒకరు. వెజ్,నాన్ వెజ్ డిషెష్ లు ఆయన ఉంటే ఆశ్చర్యపరిచే రీతిలో టీమ్ కు, సెట్ లో ఉండేవాళ్లకు వస్తూంటాయి. ఇదో పెద్ద డిస్కషన్. 
 


అయితే మరి ప్రబాస్ తన సొంతానికి ఏమీ దాచుకోవటం లేదా..అంతా ఖర్చుపెట్టడమేనా అంటే...  ఎంత ఖ‌ర్చు పెట్టినా, కొన్ని విష‌యాల్లో ఫైనాన్షియ‌ల్ బాలెన్స్ ప్రభాస్ చూసుకుంటాడని తెలుస్తోంది. ముఖ్యంగా ప్ర‌భాస్ రీసెంట్ గా  త‌న డబ్బుని రియ‌ల్ ఎస్టేట్ లో పెట్టుబడులుగా పెడుతున్నట్లు తెలుస్తోంది.  
 


అలాగే రీసెంట్ గా  ఇట‌లీలో ఓ ఖ‌రీదైన బంగ్లా కొన్నాడ‌ని అంటున్నారు.  ఇక ముంబైలోనూ కొన్ని ఫ్లాటులు కొనుగోలు చేశాడ‌ని వినికిడి. ఇక హైద‌రాబాద్ శివార్ల‌లో భారీ ఎత్తున ఓ ఫామ్ హౌస్ నిర్మిస్తున్నాడు. అది కూడా చాలా విలాస‌వంతంగా డిజైన్ చేస్తున్నట్లు చెప్తున్నాడు. రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాడంటున్నారు. 
 


అలాగే తమ ప్రొడక్షన్ హౌస్ యువి క్రియేషన్స్ లో మెల్లిగా భారీ చిత్రాలకు బై చెప్పేసి, మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మిద్దామనే నిర్ణయానికి వచ్చారట. ఇన్విస్టమెంట్ క్రింద పెడితే ఎంతో కొంత వెనక్కి రావాలి...మొత్తం పోకూడదనే ఈ నిర్ణయానికి వచ్చాడంటున్నారు. రాధే శ్యామ్ సినిమా ప్రభాస్ లో మార్పు తెచ్చిందని చెప్పుకుంటున్నారు.
 


ఇక  ప్ర‌స్తుతం ‘రాజాసాబ్‌’లో న‌టిస్తున్నాడు ప్ర‌భాస్‌. ఆ త‌ర‌వాత హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా అక్టోబ‌రులో ప‌ట్టాలెక్కనుంది. ‘స్పిరిట్’ కూడా సెట్స్‌పైకి వెళ్ల‌డానికి రెడీగా ఉంది. వీటికి సంబంధించిన  రెమ్యునరేషన్  ముందే ఓకే అయిపోయాయి. వీటి త‌ర‌వాత ఒప్పుకొనే సినిమాకు రూ.200 కోట్లు ఇవ్వాల్సిందే అంటోంది ట్రేడ్. 

click me!