ఇంకోసారి ‘యానిమల్’లాంటి సినిమా చేయనని క్షమాపణలు చెప్పా: రణ్‌బీర్‌

Published : Jul 28, 2024, 09:23 AM IST

ఇందులో నటించకుండా ఉండాల్సింది. నువ్వు యాక్ట్‌ చేయడం మమ్మల్ని బాధించింది’’ అని చెప్పారు. 

PREV
18
ఇంకోసారి ‘యానిమల్’లాంటి సినిమా చేయనని  క్షమాపణలు చెప్పా: రణ్‌బీర్‌
Ranbir Kapoor


బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్ నటించిన సూపర్‌హిట్‌ మూవీ 'యానిమల్‌' . ఈ సినిమాపై విమర్శలు ఇప్పటికి వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరో ఒకరు ఈ టాపిక్ తెస్తూనే ఉన్నారు. ఆ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా  ఓటిటి లో రిలీజ్ అయ్యాక మరింతగా సందీప్ పై సోషల్ మీడియాలో దాడి మొదలైంది. సందీప్‌ రెండ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్‌తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా సక్సెస్ కన్నా ఎక్కువ విమర్శలు రావటంతో ఈ విషయమై హీరో రణ్ బీర్ కపూర్ స్పందించారు.

28


యానిమల్ చిత్రం  విడుదలయ్యాక.. తాను ఇలాంటి చిత్రంలో నటించడం తమకు ఏమాత్రం నచ్చలేదని చాలా మంది  సినీ ప్రముఖులు  చెప్పారన్నారు. అయితే ‘‘ఇప్పటివరకూ రొమాంటిక్‌, ప్రేమకథా చిత్రాల్లో నటించా. గుడ్‌బాయ్‌ రోల్స్‌ పోషించా. ఈ కథ విన్నప్పుడు భయపడ్డా. బోల్డ్‌, అడల్ట్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉందనిపించింది. ప్రేక్షకులు అంగీకరిస్తారా? లేదా? అని టెన్షన్‌కు గురయ్యా. ఇది విడుదలయ్యాక బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టడమే కాకుండా.. విశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నా’’ అని తెలిపారు.
 

38


‘‘ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్  అందించడం కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కాకపోతే అది తప్పుగా అర్థమైంది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో సోషల్ మీడియా నెగెటివిటీని ఎక్కువగా వ్యాప్తి చేస్తుంది. కొంతమంది వ్యక్తులు మాట్లాడుకోవడానికి ఏదో ఒక అంశం కావాలి. అందుకే వాళ్లు ఇదొక స్త్రీ ద్వేషపూరిత చిత్రమని కామెంట్స్‌ చేశారు. అది నిజం కాదు. అయినప్పటికీ ప్రజల్లోకి ఆ భావన వెళ్లిపోయింది. ఇది విడుదలయ్యాక చాలామందిని కలిశా.

48

‘‘ ఇందులో నటించకుండా ఉండాల్సింది. నువ్వు యాక్ట్‌ చేయడం మమ్మల్ని బాధించింది’’ అని చెప్పారు. అలా చెప్పిన వారిలో చాలామంది పరిశ్రమకు చెందినవారే. ‘క్షమించాలి. మరోసారి ఇలాంటి సినిమా చేయను’ అని బదులిచ్చా . వారి అభిప్రాయాలతో ఏకీభవించను. ప్రస్తుతం గొడవలు పెట్టుకునే దశలో లేను. నా వర్క్‌ నచ్చలేదని చెబితే.. తదుపరి చిత్రానికి కష్టపడి వర్క్‌ చేస్తా అని చెబుతా’’ అని రణ్‌బీర్‌ తెలిపారు.
 

58


‘యానిమల్‌’ను సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించారు. రష్మిక హీరోయిన్ . త్రిప్తి డిమ్రీ కీలక పాత్ర పోషించారు. తండ్రీ తనయుల సెంటిమెంట్‌తో రూపొందించారు. ఇందులో తీవ్ర హింసను ప్రోత్సహించడం ఏం బాలేదంటూ గతంలో పలువురు బాలీవుడ్‌ దర్శక - నిర్మాతలు, రచయితలు విమర్శలు చేశారు. ‘యానిమల్‌’కు సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ రానుంది.

68

 
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. జనవరి 26 నుంచి యానిమల్‌ స్ట్రీమింగ్‌ అయ్యింది.   ఇప్పటికే ఇలాంటి చిత్రాల వల్ల సమాజానికి తీవ్రస్థాయిలో ముప్పు తప్పదని మహిళా ఎంపీలు అభిప్రాయపడ్డారు. స్త్రీ విద్వేష సినిమాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
 

78
Ranbir Kapoor


 ‘యానిమల్‌’ సినిమాపై బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు స్పందించారు. ఈ సినిమా స్త్రీ విద్వేషంతో నిండి ఉందని వెల్లడించింది. ‘బాహుబలి-2’, ‘కబీర్ సింగ్’ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. ‘బాహుబలి’ సినిమా ప్రారంభంలో స్త్రీ పాత్రలను బలంగా చూపించినా, చివరకు శృంగార బొమ్మలా చూపించే ప్రయత్నం చేశారని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేకపోగా, కీడు కలిగించే అవకాశం ఉందని వెల్లడించింది.
 

88

యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మించారు.  టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయ్యింది. మితిమీరిన ర‌క్త‌పాతం, అస‌భ్యక‌ర‌మైన కొన్ని హావ‌భావాలు, విన‌లేని డైలాగులు ఇబ్బంది పెడ‌తాయి. ఇవన్నీ ప్రక్కన పెడితే యూత్ కు పిచ్చ పిచ్చగా ఎక్కేసింది.
 

click me!

Recommended Stories