‘మహారాజ’హిందీ రీమేక్...అమీర్ ని అదే భయపెడుతోంది

Published : Jul 28, 2024, 08:04 AM IST

సీనియర్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.

PREV
16
 ‘మహారాజ’హిందీ రీమేక్...అమీర్ ని అదే భయపెడుతోంది
Maharaja

ఒక భాషలో సూపర్ హిట్ అయ్యిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయటం కామన్ గా జరిగే విషయం. అయితే ఓటిటిలు వచ్చాక అది తగ్గిపోయింది. కాని స్టార్ హీరోలు రీమేక్ లు చేస్తూనే ఉన్నారు.  ఈక్రమంలో తాజాగా    విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi)త‌న 50వ సినిమాగా మన ముందుకు వచ్చిన మ‌హారాజా (Maharaja )సినిమాని హీందీలోకి రీమేక్ చేయటానికి రంగం సిద్దమైందని తెలుస్తోంది. 

26
aamir khan

 
ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన విజయ్‌ సేతుపతి నటించిన ‘మహారాజ’ (Maharaja). విజయ్‌ సేతుపతి 50వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమాలో ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. రూ.20 కోట్లతో రూపొందించిన ‘మహారాజ’ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించి విజయ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌లలో చేరింది. ఇప్పుడీ సినిమాను  బీటౌన్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ ఈ సినిమాను రీమేక్‌ చేయనున్నారట. 

36
maharaja


ఇప్పటికే దీని హిందీ రైట్స్ ను ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో ఆమిర్‌ ముందుంటారు. గతంలో ఆయన తండ్రి పాత్రలో నటించిన ‘దంగల్’ సూపర్‌ హిట్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్‌ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు ‘మహారాజ’ను రీమేక్‌ చేస్తే ఇది కూడా ఆయన కెరీర్‌లో నిలిచిపోయే చిత్రమవుతుందని అభిమానులు భావిస్తున్నారు. 

46


అయితే అమీర్ ని భయపెడుతున్న విషయం ఒకటే అంటున్నారు. అదే నెట్ ఫ్లిక్స్ లో హిందీ డబ్బింగ్ తో సహా ఓటిటి వెర్షన్ అందుబాటులో ఉంది. ఇప్పటికే బోలెడు అంత మంది చూసేసి ఉంటారు. అలా ఓటిటిలలో వచ్చిన సినిమాలు రీమేక్ లు ఈ మధ్యన కలిసి రావటం లేదు. అక్షయ్ కుమార్ సర్ఫిరా, సెల్ఫీ, బచ్చన్ పాండేలాగా చేదు ఫలితం అమీర్ ని భయపెడుతోందిట.  దానికి తోడు హాలీవుడ్ చిత్రం రీమేక్ గా వచ్చి   లాల్ సింగ్ చద్దా సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. అయితే ఒకటే ధైర్యం ఆయన్ని ముందుకు నడిపిస్తోంది.  నార్త్ ఇండియాకు సరపడ మార్పులు చేస్తే ఏమైనా కలిసి వస్తుందేమో అని భావిస్తున్నారట.

56


క‌థేంటంటే: మ‌హారాజా (విజ‌య్ సేతుప‌తి) ఓ బార్బ‌ర్‌. ఒక‌ ప్ర‌మాదంలో భార్య‌ను పోగొట్టుకుంటాడు. అత‌నికంటూ మిగిలిన‌ ఒకే తోడు కూతురు జ్యోతి. త‌ను ఆ బిడ్డ‌తోనే క‌లిసి సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. మ‌హారాజా ఓరోజు ఒంటి నిండా గాయాల‌తో పోలీస్‌స్టేష‌న్ గ‌డ‌ప తొక్కుతాడు.  ముగ్గురు ఆగంత‌కులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి త‌న‌పై దాడి చేశార‌ని.. ఈ క్ర‌మంలోనే త‌మ బిడ్డ ప్రాణాల్ని కాపాడిన ల‌క్ష్మిని ఎత్తుకెళ్లిపోయార‌ని.. ఎలాగైనా స‌రే ఆ ల‌క్ష్మిని వెతికి పెట్ట‌మ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాడు.  మ‌రి మ‌హారాజా చెప్పిన ఆ ల‌క్ష్మి ఎవ‌రు?  అతని ఫిర్యాదును స్వీక‌రించ‌డానికి పోలీసులు తొలుత ఎందుకు నిరాకరించారు?  అస‌లు మ‌హారాజ‌పై దాడి చేసిన ముగ్గురు వ్య‌క్తులెవ‌రు?వాళ్లకు అత‌నికి ఉన్న విరోధం ఏంటి?  అన్న‌ది సినిమా చూసి తెలుసుకోవాలి.

66

ద‌ర్శ‌కుడు స్క్రీన్‌ప్లేను ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా న‌డిపిన తీరు.. విజ‌య్ సేతుప‌తి విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌ ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా నిల‌బెట్టాయి.  ఇది ఓ సింపుల్ పాయింట్‌లా స‌రదా స‌ర‌దాగా మొద‌లై.. ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్టుల‌తో భావోద్వేగ‌భ‌రితంగా ముగుస్తుంది. ముఖ్యంగా ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో వ‌చ్చే మ‌లుపులు.. సేతుప‌తి యాక్ష‌న్ హంగామా బాగా ఆక‌ట్టుకుంటాయి.

click me!

Recommended Stories