Ranbir Kapoor : కూతురి ఫేస్ రివీల్ చేసిన రణబీర్, అలియా.. రాహపై ఫ్యాన్స్ అభిప్రాయం ఇదే?

First Published | Dec 25, 2023, 5:00 PM IST

బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ Ranbir Kapoor  దంపతులు తొలిసారిగా వారి ముద్దుల కూతురు Raha Kapoorను పబ్లిక్ చూపించారు. చిన్నారి క్యూట్ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇక స్టార్ కిడ్ గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పడం విశేషం. 

బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ రీసెంట్ గానే ‘యానిమల్’ Animal మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఈ చిత్రంలో తన పెర్ఫామెన్స్ కు సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగు ఆడియెన్స్ కు కూడా రన్బీర్ బాగా దగ్గరయ్యారు. దీంతో ఆయన గురించిన అప్డేట్స్ పట్ల ఆసక్తిగా ఉంటున్నారు. 

ఇక రన్బీర్ కపూర్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhattను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2022 ఏప్రిల్ 14న ముంబైలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వెడ్డింగ్ కు ఎంతో మంది ప్రముఖులు విచ్చేసి ఆశీర్వదించారు. 


అదే ఏడాది నవంబర్ లో రన్బీర్, అలియాకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆ చిన్నారినే రాహ కపూర్ Raha Kapoor. స్టార్ కిడ్ పుట్టినప్పటి నుంచి మీడియా కంట పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇక తాజాగా మాత్రం తన కూతురు మోహాన్ని పబ్లిక్ చూపించారు. ఫొటోలకు ఫోజులిచ్చారు. 

Raha Kapoorను చూసిన అభిమానులు, నెటిజన్లు ఎంత క్యూట్ గా ఉందోనంటూ మురిసిపోతున్నారు. చిన్నారి ఫొటోలను, వీడియోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. చిన్నారి గురించి ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ను కూడా చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. 

రన్బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ Rishi Kapoor పోలికలతో రాహ కపూర్ కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. జీన్స్ కారణంగా చిన్నారి కళ్లు అచ్చం తన తాత కళ్లలాగే ఉన్నాయని చెబుతున్నారు. దీంతో స్టార్ కిడ్ ఫొటోలు మరింతగా వైరల్ గా మారాయి. 

మొత్తానికి రన్బీర్ కపూర్ క్రిస్టమస్ Merry Christmas 2023 సెలబ్రేషన్స్ తో సందర్భంగా కూతురు, భార్యతో సర్ ప్రైజ్ ఇచ్చారని మురిసిపోతున్నారు. ఇక రన్బీర్ ‘యానిమల్’ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ తో రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అటు అలియా భట్ ప్రస్తుతం ‘జిగ్ర’ అనే చిత్రంలో నటిస్తున్నారు. 

Latest Videos

click me!