సతీమణి, ఇద్దరు కొడుకులతో ఎన్టీఆర్ జపాన్ టూర్.. చిన్నోడు మాత్రం సూపర్ క్యూట్, క్రేజీ పిక్స్ వైరల్ 

Published : Dec 25, 2023, 04:05 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. 

PREV
16
సతీమణి, ఇద్దరు కొడుకులతో ఎన్టీఆర్ జపాన్ టూర్.. చిన్నోడు మాత్రం సూపర్ క్యూట్, క్రేజీ పిక్స్ వైరల్ 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. యుదసుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్ పైఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

26

ఈ చిత్రాన్ని ప్రారంభించే సమయంలో కొరటాల శివ మాట్లాడుతూ తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుంది అని ఫ్యాన్స్ కి ప్రామిస్ చేశారు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని కొరటాల శివ పక్కా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నారు.  కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, గూస్ బంప్స్ తెప్పించే డైలాగులతో కొరటాల ఈ చిత్రాన్ని విజువల్ ఫీస్ట్ గా మారుస్తున్నారు. 

36

ఆర్ఆర్ఆర్ తర్వాత అంచనాలకు తగ్గకుండా ఈ చిత్రం ఉండబోతోంది. త్వరలో గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ షూటింగ్ నుంచి చిన్న గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు వెకేషన్ బయలుదేరారు. 

 

46

తన సతీమణి లక్ష్మి ప్రణతి.. కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో ఎన్టీఆర్ జపాన్ వెకేషన్ వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

56

ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ వరకు వెకేషన్ లోనే ఉంటారని తెలుస్తోంది. ఆ తర్వాత తిరిగి వచ్చి దేవర షూటింగ్ లో పాల్గొంటారట. దేవర తర్వాత ఎన్టీఆర్ మరికొన్ని పాన్ ఇండియా చిత్రాలు లైనప్ లో ఉన్నాయి. 

66

హృతిక్ రోషన్ తో కలసి వార్ 2 మల్టీస్టారర్ మూవీలో తారక్ నటించాల్సి ఉంది. అదే సమయంలో ప్రశాంత్ నీల్ తో చిత్రం కూడా ప్రారంభం అవుతుందట. మొత్తంగా ఎలా చూసుకున్నా వచ్చే ఏడాది ఎన్టీఆర్ అభిమానులు ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా ఎంజాయ్ చేయొచ్చు. 

click me!

Recommended Stories