ఈ ఇంటిని రణబీర్–ఆలియా తమ కుమార్తె రాహా కపూర్ పేరుతో రిజిస్టర్ చేయించారు. రిపోర్టుల ప్రకారం, ఇది పలు అంతస్తులు కలిగి, సకల సౌర్యాలతో, అడ్వాన్స్ టెక్నాలజీతో నిర్మించబడుతున్నట్టు సమాచారం. అంతే కాదు ఆ ఇంట్లో ఉండే ప్రత్యేకతలు ఇవే అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఇంట్లో జిమ్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, పర్సనల్ సినిమా థియేటర్, ఆఫీస్ స్పేస్, ప్రైవేట్ బార్, లైబ్రరీ, గేమ్ జోన్, ప్లే రూమ్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. కార్ల కోసం పెద్ద గ్యారేజ్ కూడా ఏర్పాటు చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన లిఫ్ట్ సిస్టమ్ ద్వారా కార్లు నేరుగా ఇంటి హాలుకు వెళ్లేలా ప్రత్యేక డిజైన్ చేశారు.