హీరోయిన్ అందం ఉన్న యాంకర్‌గానే మిగిలిపోయింది, ఈ ఫోటోలు చూస్తే మీకు అలానే అనిపిస్తుంది

Published : Aug 27, 2025, 12:56 PM IST

యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్టార్ హీరోయిన్లకు ఉన్నంత ఫాలోయింగ్ ఈమెకు ఉంది. హీరోయిన్ అవ్వాలని వచ్చి స్టార్ యాంకర్ గా మారింది. ఇమె లేటెస్ట్ ఫోటోలను చూసి ఆనందించండి. 

PREV
15
స్టార్ యాంకర్ గా మారి

ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా మారాలని వచ్చిన శ్రీముఖి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ యాంకర్ గా మారిపోయింది. ఏ కార్యక్రమం అయినా శ్రీముఖి ఉంటే నవ్వులు పూయాల్సిందే. అందంలోనే కాదు కామెడీ టైమింగ్ లో కూడా శ్రీముఖి సాటి లేదు. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో కథానాయకగా వచ్చిన శ్రీముఖి ఆ తర్వాత హీరోయిన్ అవకాశాలను అందుకోలేకపోయింది. కొన్ని కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసి చివరికి యాంకర్ గా మారింది.

25
శ్రీముఖి ఏ ఊరు?

శ్రీముఖి నిజామాబాద్‌కి చెందిన అమ్మాయి చదువులో కూడా ఈమె టాపరే. తొంభై శాతానికి పైగా మార్కులు తెచ్చుకునేది. బిడిఎస్ లో సీటు కూడా వచ్చింది. బిడిఎస్ పూర్తవకముందే టీవీ యాంకర్ గా అవకాశాలు ఎక్కువైపోవడంతో చదువును ఆపేసింది. డాక్టర్ కావాల్సింది యాక్టర్ అయిపోయింది.

35
శ్రీముఖి హీరోయిన్ గా

2012లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ కు చెల్లెలుగా నటించిన శ్రీముఖి ఆ సమయంలోనే ఎక్కువ మంది దృష్టిలో ఈమె పడింది. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో కథానాయికగా చేసే అవకాశం వచ్చింది. కానీ ఆ తర్వాత హీరోయిన్ ఛాన్సులు రాలేదు. నేను శైలజ సినిమాలో హీరో రామ్‌కు అక్కగా నటించింది. అదే అలాగే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా చిన్న పాత్ర చేసింది. ఇక సినిమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా బుల్లితెరపైనే తన ఫోకస్ ను పెట్టింది.

45
చివరి సినిమా ఇదే

చివరిగా భోళా శంకర్ సినిమాలో ఆమె కనిపించింది. స్నేహితురాలి పాత్రలో నటించింది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నప్పటికీ తన మెయిన్ జాబ్ మాత్రం టీవీ యాంకరే సైమా అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా దుబాయ్ లో నిర్వహించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ టీవీలో, జీ టీవీ, మాటీవీ అనే తేడా లేకుండా అన్నింట్లోనూ శ్రీముఖి హవా కనిపిస్తోంది.

55
శ్రీముఖి వయసు ఎంత?

శ్రీముఖి అందంగా ఉండడం వాక్చాతుర్యం ఉండడం ఆమెకు బాగా కలిసి వచ్చింది. ప్రస్తుతం స్త్రీలకు శ్రీముఖి వయసు 33 సంవత్సరాలు. ఆమె పెళ్లి గురించి కూడా అప్పుడప్పుడు సెటైర్లు పడుతూనే ఉంటాయి. శ్రీముఖి అభిమానులు ఎక్కువ అలాగే ప్రేమ వ్యవహారంలో కూడా ఆమె ఒకసారి మోసపోయినట్టు చెప్పింది. ఆమె వ్యక్తిగత విషయాలనే పక్కన పెడితే వృత్తిగతంగా మాత్రం శ్రీముఖి అదుర్స్ అనే చెప్పాలి.

Read more Photos on
click me!

Recommended Stories