టాలీవుడ్ లో సహజనటి అంటే జయసుధ మాత్రమే గుర్తుకు వస్తుంది. అప్పుడు ఇప్పుడు ఆమెను మించి ఆ పేరు తెచ్చుకున్న నటి లేదనే చెప్పాలి. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి కృష్ణ, శోభన్ బాబు వరకూ, మురళీ మోహన్ నుంచి మోహన్ బాబు వరకూ రెండు జనరేషన్ హీరోలతో ఆడిపాడింది జయసుధ. ఆమె నటకు ఎంతో మంది ఆడియన్స్ ఫిదా అయ్యారు. అప్పటికీ ఇప్పటికీ జయసుధ నటన అభిమానులను అలరిస్తూనే ఉంది. హీరోయిన్ గా, అక్కగా, వదినగా, తల్లిగా, భామ్మగా.. కెరీర్ లో ఎన్నో అద్భుతమై పాత్రలు పోషించింది జయసుధ. మూడు తరాల తారలతో ఆమె నటించి మెప్పించింది. మొదటి తరం హీరోల జంటగా నటించిన సహజనటి, ఆతరువాత తరం హీరోలకు అమ్మగా కనిపించింది. ఇక ప్రస్తుతం యంగ్ హీరోలకు నానమ్మగా నటిస్తోంది.