Ranbir-Alia Mehandi : రన్బీర్ కపూర్, అలియా భట్ మెహందీ ఫంక్షన్.! ఆర్కే స్టూడియో వద్ద బాలీవుడ్ తారల సందడి..

Published : Apr 13, 2022, 07:32 PM IST

బాలీవుడ్ స్టార్స్ రన్బీర్ కపూర్ - అలియా భట్ వెడ్డింగ్ వైబ్స్ మొదలయ్యాయి. ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ వీరి వివాహం సందర్భంగా విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం ముంబయిలోని ఆర్కే స్టూడియోకు బాలీవుడ్ తారలు తరలివస్తున్నారు.    

PREV
17
Ranbir-Alia Mehandi : రన్బీర్ కపూర్, అలియా భట్ మెహందీ ఫంక్షన్.! ఆర్కే స్టూడియో వద్ద బాలీవుడ్ తారల సందడి..

స్టార్ హీరో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor), హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) ఇద్దరు ఒక్కటి కాబోతున్నారు. కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ స్టార్ జంట మరో రెండు  మూడు రోజుల్లో దంపతులుగా మారనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ముంబయిలోని ఆర్కే స్టూడియోలో రన్బీర్ మరియు అలియా భట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ వేడుకలు నాలుగు రోజుల పాటు కొనసాగనున్నట్టు సమాచారం. 
 

27

అయితే ఇప్పటి వరకు ఈ లవ్ బర్డ్స్  తమ వివాహంపై నోరు విప్పలేదు. కానీ, తాజా సమాచారం ప్రకారం రన్బీర్ అలియా మెహందీ ఫంక్షన్ ఈ రోజు ఆర్కే స్టూడియోలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడ బాలీవుడ్ తారల సందడి నెలకొంది.
 

37

రన్బీర్ - అలియా భట్ వెడ్డింగ్ సందర్భంగా ఇప్పటికే ముంబైలోని చెంబూర్‌లో ఉన్న ఐకానిక్ ఆర్కే స్టూడియో వద్ద విద్యుత్ కాంతులతో ప్రకాశిస్తోంది. దీనికి తోడు బాలీవుడ్ తారలు ప్రత్యక్షమవుతుండటంతో ఆ ప్రాంతమంతటా మరింత సందడి నెలకొంది. మొత్తం మీద ముంబయిలో రన్బీర్ అలియా భట్ వెడ్డింగ్ వైబ్స్ (Ranbir-‌Alia Wedding) మొదలయ్యాయి. అయితే రోజు స్టూడియోలో నిర్వహిస్తున్న మెహందీ ఫంక్షన్ కోసం బాలీవుడ్ నటీనటులు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. 
 

47

ఈ సందర్భంగా అలియా భట్ తండ్రి, ప్రముఖ నిర్మాత మహేశ్ భట్, అక్క పూజా భట్ బుధవారం మధ్యాహ్నం మెహందీ ఫంక్షన్ కు చేరుకున్నారు.  తండ్రీకూతుళ్లు ఇద్దరూ పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ భట్ తెలుపు కుర్తాలో, పూజా భట్ పసుపు మరియు గులాబీ రంగు దుస్తుల్లో ఆకట్టుకుంటున్నారు.  
 

57

కరీనా కపూర్ (Kareena Kapoor), అలాగే ఆమె సోదరి కరిష్మాతో, నీతూ కపూర్ కుమార్తె రిద్ధిమా, మనవరాలు సమర మరియు చిత్రనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) కూడా హాజరయ్యారు. అలాగే రణబీర్ కజిన్స్ అర్మాన్ మరియు ఆదార్ జైన్, కోడలు అనిస్సా మల్హోత్రా మరియు అత్త రిమా జైన్ కూడా ఈ మెహందీ ఫంక్షన్ లో సందడి చేశారు.  

67

రేపు సాయంత్రం 3 గంటలకు వాస్తు వారి ఫ్లాట్‌లో వివాహం జరుగుతుందని కుటుంబ సన్నిహిత వర్గాలు ఓ ప్రముఖ ఛానెల్  కు తెలిపాయి. అయితే కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే వివాహ వేడుకలు జరగనున్నట్టు తెలుస్తోంది.  
 
 

77

అలియా భట్ మరియు రణబీర్ కొన్నేండ్లుగా డేటింగ్ లో ఉన్నారు. ఏట్టకేళలకు ఇప్పుడు ఒకటవుతున్నారు. వీరిద్దరూ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘బ్రహ్మస్త్ర’లో తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది.  

click me!

Recommended Stories