చిరంజీవిని వరుసగా 23సార్లు చెంప వాయించిన రాధిక.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన సీనియర్‌ నటి

Published : Apr 13, 2022, 06:22 PM IST

చిరంజీవి, రాధిక టాలీవుడ్‌లో హిట్‌ కాంబినేషన్‌. అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. కానీ మెగాస్టార్‌ని 23సార్లు చెంప దెబ్బలు కొట్టిన ఘటన బయటపెట్టింది రాధిక. దీంతో ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. 

PREV
16
చిరంజీవిని వరుసగా 23సార్లు చెంప వాయించిన రాధిక.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన సీనియర్‌ నటి

రాధికా చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో ఇటీవల `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో నటించింది. ఈ సినిమా పరాజయం చెందింది. కానీ రాధిక మరోసారి తెలుగు ఆడియెన్స్ ని వెండితెరపై  అలరించింది. ఇప్పుడు టాలీవుడ్‌లో యాక్టివ్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె `అలీతో సరదాగా` షోలో పాల్గొంది. హాస్య నటుడు అలీతో అనేక సరదా విషయాలను పంచుకుంది. అదే సమయంలో పలు షాకింగ్‌ విషయాలను కూడా వెల్లడించింది. 
 

26

సినిమాలో హీరోయిన్‌గా చేసిన తర్వాత అమ్మ పాత్రలు చేయాల్సి ఉంటుందని, ఇదొక ఫార్ములాగా ఉంటుందని, అలా చేయడం తనకిష్టం లేదని, అందుకే టీవీల్లో నటిస్తున్నట్టు తెలిపింది రాధిక. తనకు ఈటీవీ బ్రేక్‌ ఇచ్చిందని వెల్లడించింది. మరోవైపు `మూడు ముళ్లు` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినట్టు చెప్పింది రాధిక. 

36

ఈ సందర్భంలో చంద్రమోహన్‌కి సంబంధించి ఓ సరదా సన్నివేశాన్ని వెల్లడించింది. టిఫిన్‌ డబ్బాలు, ఆయన నచ్చితే తీసుకెళ్లేవారని తెలిపింది. ఈ క్రమంలో చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చింది. తన జీవితంలో టర్నింగ్‌ పాయింట్‌ `న్యాయం కావాలి` సినిమా అని తెలిపింది రాధిక. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో రాధిక ఓ కథానాయిక. కోదండరామిరెడ్డి దర్శకుడు. 
 

46

ఈ సినిమా షూటింగ్‌ సమయంలో చోటు చేసుకున్న ఓ విషయాన్ని పంచుకుంది రాధిక. ఇందులో ఓ సన్నివేశంలో చిరంజీవిని కొట్టి కొట్టి మాట్లాడే సన్నివేశం ఉందట. చెంపదెబ్బ కొట్టాల్సి ఉంది. కానీ సరిగా రావడం లేదని, దీంతో 23 టేకులు తీసుకుందట. దీంతో 23 సార్లు చిరంజీవి చెంప చెల్లుమనిపించినట్టు చెప్పింది. ఆ టేక్‌ పూర్తయ్యాక చూస్తే చిరంజీవి మొహం ఎర్రగా మారిపోయిందని చెప్పి నవ్వులు పూయించింది. 

56

అయితే ఇందులో ఆ తర్వాత చిరంజీవి సైతం రాధికని కొట్టే సన్నివేశం ఉంటుంది. ఆ సీన్‌లో చిరు కూడా రెచ్చిపోయాయి రాధిక చెంప్ప చెళ్లుమనిపించాడట. ఈ సన్నివేశం చిరు, రాధికల మధ్య చిచ్చు పెట్టిందని, గొడవ అయ్యిందని, దీంతో కొన్ని రోజుల వరకు దూరంగా ఉన్న వీరిద్దరు మళ్లీ కలిసిపోయినట్టు సమాచారం. చిరంజీవి, రాధికల కాంబినేషన్‌లో `న్యాయం కావాలి`, `అభిలాష`, `రాజా విక్రమార్క`, `దొంగమొగుడు`, `గూడచారి నెం.1`,`యమకింకరుడు`, `కిరాయి రౌడీలు`, `బిల్లా రంగా`, `హీరో` వంటి అనేక చిత్రాలొచ్చాయి. 

66

ఇదిలా ఉంటే `అలీతో సరదాగా`షోలో మరికొన్ని ఆసక్తికర విషయాలను చెప్పింది రాధికా. శరత్‌ కుమార్‌తో ప్రేమ, పెళ్లి విషయాన్ని, తన కూతురితో విభేదాలు, ఆమె మ్యారేజ్‌ విషయాలను కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఈ నెల 18న పూర్తి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories