దీపికాని మోసం చేయడంపై రణబీర్ బోల్డ్ స్టేట్మెంట్.. ఆమెకు టెంప్ట్ అయ్యాను అంటూ..

pratap reddy   | Asianet News
Published : Oct 16, 2021, 05:37 PM IST

బాలీవుడ్ లో రణబీర్ కపూర్ చాక్లెట్ బాయ్. స్టైలిష్ గా ఉంటూ, రొమాంటిక్ లుక్స్ తో అభిమానులని సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా రణబీర్ కు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. అందుకు కారణం అతడి అందమే.

PREV
16
దీపికాని మోసం చేయడంపై రణబీర్ బోల్డ్ స్టేట్మెంట్.. ఆమెకు టెంప్ట్ అయ్యాను అంటూ..

బాలీవుడ్ లో రణబీర్ కపూర్ చాక్లెట్ బాయ్. స్టైలిష్ గా ఉంటూ, రొమాంటిక్ లుక్స్ తో అభిమానులని సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా రణబీర్ కు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. అందుకు కారణం అతడి అందమే. లెజెండ్రీ నటుడు రిషి కపూర్ తనయుడిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రణబీర్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. 

 

26

ఇంతటి అందగాడికి లవ్ ఎఫైర్స్ ఉండడం కూడా సహజమే. తన రొమాంటిక్ లుక్స్ తో రణబీర్ ఎందరో హీరోయిన్లని తన బుట్టలో వేసుకున్నాడు. బాలీవుడ్ లో అగ్రతారలుగా వెలుగొందుతున్న దీపికా, కత్రినా కైఫ్ లు సైతం Ranbir Kapoor రొమాంటిక్ లుక్స్ కు క్లీన్ బౌల్డ్ అయ్యారు. 

 

36

రణబీర్, Deepika Padukone ఎఫైర్ బాలీవుడ్ లో ఇప్పటికీ హాట్ టాపిక్. కొంతకాలం చెట్టాపట్టాలేసుకు తిరిగిన ఈ జంట ఊహించని పరిస్థితుల్లో విడిపోయారు. వీరిద్దరి లవ్ బ్రేకప్ కావడానికి కారణం రణబీర్ కపూరే. రణబీర్ తనని మోసం చేశాడు అంటూ దీపికా పలు సందర్భాల్లో తెలిపింది. దీనిపై రణబీర్ కూడా ఓపెన్ అయ్యాడు. తాను దీపికాని మోసం చేసిన సంగతి వాస్తవమే అంటూ బోల్డ్ గా ఒప్పేసుకున్నాడు. 

 

46

అవును.. ఆమెని నేను మోసం చేశాను. ఆ సమయంలో నా అపరిపక్వత, అనుభవం లేకపోవడం వల్లే అలా జరిగింది. ఒకరు టెంప్ట్ చేయడాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాను అంటూ తన వ్యక్తిగత విషయాన్ని రణబీర్ బోల్డ్ గా చెప్పేశాడు. ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత రియలైజ్ అయ్యాను. ఒకరితో కమిటై ఉండలేనప్పుడు వారితో రిలేషన్ లో ఎందుకు ఉండాల్సి వచ్చింది అని బాధపడ్డా అంటూ రణబీర్ చెప్పుకొచ్చాడు. 

 

56

రణబీర్ మాటలు వింటుంటే.. దీపికా ఒక సందర్భంలో ఇచ్చిన స్టేట్ మెంట్ నిజమే అనిపిస్తుంది. రణబీర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను అని దీపికా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. రణబీర్ కూడా ఒకరికి టెంప్ట్ అయ్యాను అని చెప్పాడు. దీపికా, రణబీర్ విడిపోవడానికి కారణం Katrina Kaif అనే ఊహాగానాలు బాలీవుడ్ లో ఉన్నాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. కత్రినా, రణబీర్ ప్రైవేట్ గా ఉండగా దీపికా గమనించి ఉండవచ్చు అనే ప్రచారం బాలీవుడ్ లో ఉంది. 

 

66

దీనితో రణబీర్, దీపికా విడిపోయారు. దీపికా నుంచి విడిపోయిన వెంటనే రణబీర్ కత్రినాతో రొమాన్స్ జోరు పెంచాడు. చాలా కాలం పాటు వీరిద్దరూ సహజీవనం చేశారు. అప్పట్లో వీరిద్దరి ప్రైవేట్ ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కత్రినా నుంచి కూడా రణబీర్ విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రణబీర్.. RRR హీరోయిన్ అలియా భట్ తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ జంట పెళ్లిపీటలెక్కబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 

 

click me!

Recommended Stories