Ranabaali Treat: విజయ్‌ దేవరకొండ, రష్మిక అభిమానులకు `రణబాలి` ఊహించని ట్రీట్‌.. తెరపై మరోసారి పెళ్లి

Published : Feb 28, 2026, 12:21 PM IST

ఇప్పటికే ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో మ్యారేజ్‌ చేసుకున్న విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా జంటకి `రణబాలి` టీమ్‌ మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. వెండితెరపై జరిగిన పెళ్లి వీడియోని పాట రూపంలో విడుదల చేస్తూ విషెస్‌ తెలిపారు. 

PREV
16
గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న విజయ్‌, రష్మిక జంట

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. గురువారం రాజస్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. ఇటు హిందూ సాంప్రదాయం ప్రకారం, అటు రష్మికకి చెందిన కొడువ సాంప్రదాయం ప్రకారం ఈ మ్యారేజ్‌ జరగడం విశేషం. అదే సమయంలో వీరి వెడ్డింగ్‌ రాజుల కాలాన్ని తలపించింది. రాజులు, దేవతలను తలపించేలా పెళ్లి చేసుకోవడం విశేషం. దీంతో ఇప్పుడంతా వీరి మ్యారేజ్‌ గురించే చర్చించుకుంటున్నారు.

26
మార్చి 4న విజయ్‌, రష్మిక రిసెప్షన్‌

రష్మిక మందన్నా, విజయ్‌ ధరించిన దుస్తులు, జూవెల్లరీ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇక పెళ్లి ముగించుకుని హైదరాబాద్‌కి తిరిగి వచ్చారు ఈ కొత్త జంట. ఎయిర్‌ పోర్ట్ లో ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. త్వరలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేయబోతున్నారు. మార్చి 4న రిసెప్షన్‌ అని ఫిక్స్ చేశారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరుకాబోతున్నారు. తాజ్‌ కృష్ణలో ఈ రిసెప్షన్‌ జరగనుంది.

36
విజయ్‌, రష్మిక అభిమానులకు `రణబాలి` టీమ్‌ సర్‌ప్రైజ్‌

ఇదిలా ఉంటే ఇప్పటికే ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో రెండుసార్లు తమ రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు మరోసారి మ్యారేజ్‌ చేసుకున్నారు. అయితే ఈ సారి తెరపై పెళ్లి చేసుకోవడం విశేషం. ఆ పెళ్లి వీడియోని విడుదల చేసింది `రణబాలి` టీమ్‌. రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇప్పటికే చిత్రీకరణ చాలా వరకు పూర్తి చేసుకుంది. ఇందులో రష్మికమందన్నా, విజయ్‌ దేవరకొండ కలసి నటిస్తున్నారు. `డియర్‌ కామ్రేడ్‌` తర్వాత ఈ ఇద్దరు జోడీ కట్టిన చిత్రమిది.

46
తెరపై మరోసారి విజయ్‌, రష్మిక పెళ్లి

ఇందులో రణబాలిగా విజయ్‌ కనిపిస్తున్నారు. జయమ్మగా రష్మిక మందన్నా నటిస్తుంది.  ఈ ఇద్దరు పెళ్లైన జంటగా నటించారు. ఆ పెళ్లి సీన్లతో కూడిన సాంగ్‌ని విడుదల చేసింది టీమ్‌. విజయ్‌, రష్మిక మ్యారేజ్‌ చేసుకున్న నేపథ్యంలో వారికి విషెస్‌ తెలియజేస్తూ ఈ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది. `ఏందయ్యా సామి` అంటూ సాగే ఈ సాంగ్‌ వీడియో ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్‌, రష్మిక పెళ్లి కూడా రియల్‌ మ్యారేజ్‌ని తలపించేలా ఉంది. వీడియో సాంగ్‌లో విజయ్‌ సీరియస్‌గా కనిపిస్తున్నారు. ఆయన్ని ఆకట్టుకునే ప్రయత్నాల్లో రష్మిక ఉంది. ఈ వీడియో సాంగ్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఓ వైపు రియల్‌ పెళ్లి, ఇంకోవైపు వెండితెరపై పెళ్లితో విజయ్‌, రష్మికల పెళ్లి సందడి వేరే లెవల్‌ అని చెప్పొచ్చు.

56
రణబాలి కథా నేపథ్యం

`రణబాలి` మూవీ టైటిల్‌ని ప్రకటిస్తూ విడుదల చేసిన గ్లింప్స్ కి విశేష ఆదరణ దక్కింది. స్వాతంత్య్రానికి ముందు 1878లో జరిగిన కథని ఇందులో చూపించబోతున్నారు. ఆ సమయంలో బ్రిటీష్‌ వారు మన భారతీయులను ఎంతగా చిత్ర హింసలు పెట్టారు, కనీసం ఫుడ్‌ కూడా లేకుండా ఎలా దోచుకున్నారనేది, స్వాతంత్య్ర ఉద్యమానికి ముందు జరిగిన చీకటి రహస్యాలను, చరిత్రలోని లేని రహస్యాలను చూపించారు. 

66
1854 - 1878 మధ్య జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రణబాలి

ఆ టైమ్‌లో మన ఇండియా నుంచి బ్రిటీష్‌ వారు ఏకంగా 45 ట్రిలియన్‌ డాలర్లు దోచుకుపోయారట. హిట్లర్‌ కంటే దారుణమైన నియంతృత్వం చోటు చేసుకుందట. కేవలం 40ఏళ్ల వ్యవధిలోనే వందల మిలియన్స్ ప్రజలు ఆకలితో చనిపోయారట. ఇలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి `రణబాలి` పుట్టుకొచ్చాడని, బ్రిటీష్‌ వారి అంతు చూశాడనే విషయాన్ని ఇందులో చూపించారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 11న సినిమా విడుదల కానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories