
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన మూవీ `రణబాలి`. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్` చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటిస్తోన్న మూవీ కావడం విశేషం. అదే సమయంలో పెళ్లి తర్వాత కలిసి నటిస్తోన్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. పైగా పీరియాడికల్ హిస్టరీ మూవీ కావడంతో క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. మరి సినిమా అదే స్థాయిలో ఉందా? అనేది చూస్తే, ఫస్ట్ రివ్యూ వచ్చింది. సినిమా చూసిన వాళ్లు చెప్పిన అభిప్రాయం ప్రకారం మూవీ ఎలా ఉందంటే?
సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. యూ ఏ సర్టిఫికేట్ పొందింది. నిడివి రెండు గంటల 58 నిమిషాలు ఉంటుందని సెన్సార్ రిపోర్ట్ వెల్లడించింది. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన కొన్ని సీన్ల డోస్ తగ్గించారట. రక్తపాతానికి సంబంధించిన సన్నివేశాల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయట. అలాగే కొన్ని డైలాగ్లు, పదాలను మ్యూట్ చేయాల్సి వచ్చిందట. ఇలాంటి కొన్ని అభ్యంతరాలతో యూ ఏ సర్టిఫికేట్ వచ్చింది. 16ఏళ్ల పైబడ్డ వాళ్లు మాత్రమే సినిమాని చూడొచ్చు.
రణబాలి మూవీ కథ ఏంటనేది చూస్తే, 1870 ప్రాంతంలో బ్రిటిష్ పాలనలో ఉన్న రాయలసీమ నేపథ్యంలో ‘రణబాలి’ కథ సాగుతుంది. సాధారణ యువకుడైన రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనుండగా, జయమ్మ పాత్రలో రష్మిక మందన్న నటిస్తోంది. ఒకే గ్రామానికి చెందిన రణబాలి, జయమ్మ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. అయితే వారి జీవితాల్లో అనూహ్యమైన పరిస్థితులు ఎదురవుతాయి. ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర కరువు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఆకలితో అలమటించే ప్రజలు కనీసం తిండి కోసం బ్రిటిష్ వారి వద్ద పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ క్రమంలో బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాలు, ప్రజలపై సాగించే అరాచకాలు తీవ్రరూపం దాలుస్తాయి. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన రణబాలి తిరుగుబాటు బాట పడతాడు. బ్రిటిష్ వారి దోపిడీని, దౌర్జన్యాలను అతడు ఎలా ఎదుర్కొన్నాడు? అతడి పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
ఈ సినిమాకు కథ, కథనాలు ప్రధాన బలంగా ఉంటాయని చెబుతున్నారు. రాహుల్ సంకృత్యాన్ ఎంచుకున్న విభిన్నమైన నేపథ్యం, బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితుల చిత్రణ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట మరోసారి తెరపై కనిపించనుండటంతో వారి కెమిస్ట్రీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సినిమాలోని ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలు కథలో భావోద్వేగాలకు బలంగా నిలుస్తాయట. రణబాలిగా విజయ్ దేవరకొండ, జయమ్మగా రష్మిక మందన్న తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని చెబుతున్నారు.
ఇక బలమైన కథ, బ్రిటిష్ పాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు, యాక్షన్ సీక్వెన్స్ మతిపోయేలా ఉంటాయని అంటున్నారు. రాయలసీమ యాస కూడా సినిమాకి ప్లస్ అవుతుందని చెబుతున్నారు. అదే సమయంలో సినిమా స్లోగా సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. అదే మైనస్ అంటున్నారు. బ్రిటీష్పై తిరుగుబాటు సీన్లు కొంత కనెక్ట్ కావడం కష్టమనే టాక్ ఉంది. విజువల్గా అదిరిపోతుందంటున్నారు. అయితే సినిమా చూసేంత వరకు దీన్ని జడ్జ్ చేయడం కష్టమే. ఒరిజినల్ ఏసియానెట్ రివ్యూ కోసం వెయిట్ చేయండి.