
అనుపమా పరమేశ్వరన్.. కమర్షియల్ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తోంది. ఈ మధ్య ఆమె ఎక్కువగా మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు `క్రేజీ కల్యాణం` అనే సినిమాలో నటించింది. ఆమె పాత్ర చుట్టూ తిరిగే కథ ఇది. ఇందలో సీనియర్ నరేష్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి(అఖిల్ రాజ్) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకత్వంలో యారో సినిమాస్ పతాకంపై బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం రేపు శుక్రవారం( అక్టోబర్ 16)న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అనుపమా పరమేశ్వరన్ మీడియాతో మాట్లాడుతూ, క్రేజీ స్టేట్మెంట్ ఇచ్చింది.
`క్రేజీ కల్యాణం` సినిమా పెళ్లి నేపథ్యంలో సాగుతుంది. కూతురుకి పెళ్లి చేయాలనుకుంటాడు తండ్రి నరేష్. కానీ తనకు ఇష్టం లేదు. ఈ క్రమంలో చోటు చేసుకునే డ్రామానే మూవీ. కామెడీ, ఫ్యామిలీ డ్రామాగా మూవీ సాగుతుందట. అయితే ఈ విషయాన్ని అనుపమా చెబుతూ, ఈ సినిమాలోలా మా ఇంట్లో నా పెళ్లి గురించి ఏమాత్రం ఒత్తిడి లేదు. నీకు ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే మా వాళ్లు అంటారు. నాకైతే పెళ్లికి ముందే ఒక బేబిని కనాలని ఉంది. మా కేరళ వివాహా వేడుకల్లో పూర్తిగా శాకాహారమే వడ్డిస్తారు. కానీ తెలంగాణ పెళ్లి వేడుకల్లో కొత్త కల్చర్ తెలుసుకున్నాను. మా కేరళలో ఇప్పుడు పెళ్లి వేడుకల్లో హల్దీ, మెహందీ అని కొత్త కొత్త కల్చర్స్ వస్తున్నాయి గానీ గతంలో ఎంగేజ్ మెంట్ , పెళ్లి ఈ రెండే వేడుకలు జరిపేవారు` అని చెప్పింది.
సినిమా గురించి చెబుతూ, `క్రేజీ కల్యాణం సినిమాలో మా క్యారెక్టర్స్ అన్ని స్ట్రగుల్ పడుతుంటాయి. మా కష్టాలు మీకు కామెడీగా అనిపిస్తాయి. మా పాత్రల ద్వారా, ఆ సందర్భాల ద్వారా ఆర్గానిక్ గా కామెడీ జెనరేట్ అవుతుంటుంది. స్క్రిప్ట్ చెప్పేందుకు వచ్చినప్పుడే డైరెక్టర్ గా బద్రప్పలోని సిన్సియారిటీ, కన్విక్షన్ చూశాను. ఆయన ఈ కథ చెబుతుంటే కొన్ని సార్లు నవ్వొచ్చింది, కొన్ని సీన్స్ కు ఎమోషనల్ అయ్యాను. బాలరాజు పాత్రతో సహా ఆయన కంప్లీట్ స్క్రిప్ట్ చెప్పారు. స్క్రిప్ట్ తో పాటు దర్శకుడిగా బద్రప్ప జెన్యూన్ అప్రోచ్ నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నాను. మా మూవీలో తరుణ్ భాస్కర్ చేసిన బాలరాజు క్యారెక్టర్ మనలో ఒకడు, మనం రోజు చూసే లైఫ్ లో నుంచి వచ్చిన పాత్ర అది. ఆ క్యారెక్టర్ లో చాలా ఫన్ ఉంటుంది. మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా కొంతవరకు బాలరాజు లే.
సినిమా చేస్తున్న ప్రాసెస్ లో ప్రతీది క్రేజీగా అనిపించాయి. దాంతో మా డైరెక్టర్ క్రేజీ కల్యాణం అని టైటిల్ పెట్టారు. ఇది ఫన్, ఎమోషన్ ఉన్న స్టోరీ. నరేష్ గారు, అఖిల్, తరుణ్ భాస్కర్..ఇలా వీళ్లంతా కాస్టింగ్ లో జాయిన్ అయ్యాక మరింత క్రేజీ ప్రాజెక్ట్ అయ్యింది. ఈ సినిమా కోసం నేను ఇంటెన్స్ ప్రమోషన్స్ చేశాను. పర్సనల్ గా హ్యాపీగా ఉన్నా కాబట్టి అంత ఎంజాయ్ చేస్తూ ప్రమోషన్స్ లో పాల్గొన్నాను. జగన్ మోహన్ రెడ్డి లాంటి క్రేజీ ప్రొడ్యూసర్ లేకుంటే ఈ సినిమా ఇంత బాగా మన ముందుకు వచ్చేది కాదు` అని వెల్లడించింది అనుపమా.
కథలో మా పాత్రలు పరిచయం అయ్యాక పెళ్లికి సంబంధించిన పాయింట్ వస్తుంది. ప్రేక్షకులు కథలోకి వెళ్లేందుకు పెద్దగా సమయం పట్టదు. పెళ్లి అనేది ఇద్దరు కలిసి సంతోషంగా జీవించడానికి చేసుకునేది కానీ అమ్మాయిని ఇంట్లో పని మనిషిని చేసేందుకు కాదు అనేది నా క్యారెక్టర్ కీర్తి ఉద్దేశం. వ్యక్తిగతంగా నా ఒపీనియన్ కూడా అదే. అందుకే ట్రైలర్ లో నేను వంట చేస్తే నువ్వు గిన్నెలు కడగాలి అనే డైలాగ్ పెట్టాం. అఖిల్ టాలెంటెడ్ యాక్టర్. అఖిల్ నటనలో ఎమోషనల్ హానెస్టీ ఉంటుంది, ఎమోషన్స్ ఆర్టిఫిషల్ గా అనిపించవు. కళ్లలో స్పార్క్ ఉంటుంది. ఆ క్వాలిటీస్ అన్నీ ఉదయ్ క్యారెక్టర్ కు కావాలి. కీర్తి స్ట్రిక్ట్ క్యారెక్టర్. ఆ పాత్రకు బ్యాలెన్స్ చేస్తూ సపోర్టివ్ గా ఉంటాడు ఉదయ్.
కొన్ని ప్రాజెక్ట్స్ లో మనం చెప్పేందుకు ఏమీ ఉండదు. వాళ్లు ఇచ్చిన క్యారెక్టర్ చేసుకుని వెళ్లిపోతాం. కానీ క్రేజీ కల్యాణం లాంటి సినిమాలకు నా అభిప్రాయాలు చెప్పి, మాట్లాడుకుని చేసే స్పేస్ ఉంది. డైరెక్టర్ బద్రప్పతో నాకు అనిపించిన ఆలోచనలు షేర్ చేసుకున్నాను. అలాగే నరేష్ గారు, అఖిల్, తరుణ్..ఇలా మేమంతా కలిసి డిస్కస్ చేసుకుని నటించాం. సీన్స్ మరింత బెటర్ గా వచ్చేందుకే ఈ ప్రయత్నమంతా చేశాం. ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడాను. యాస కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్స్ చేయలేదుగానీ డైరెక్టర్ చెప్పేదాన్ని అబ్సర్వ్ చేస్తూ డైలాగ్స్ చెప్పాను` అని చెప్పింది.
`నరేష్ గారి లాంటి సీనియర్ తో నటించడం ఎప్పుడూ ఇన్స్ పైర్ చేస్తుంటుంది. ఆయనకు నటన మీద ఉన్న ప్యాషన్ నన్ను చాలా ఇన్స్ పైర్ చేసింది. క్రేజీ కల్యాణంతో మేమొక మంచి సినిమా చేశామనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. మా పేరెంట్స్ క్రేజీ కల్యాణం సినిమా చూసి చాలా బాగుందని ప్రశంసించారు. తెలుగు భాష రాకున్నా వాళ్లకు సినిమాలోని ఎమోషన్ కనెక్ట్ అయ్యింది. ప్రేక్షకులకు మా సినిమా వాళ్ల ఇంటి కథలా అనిపిస్తుంది. పండుగ సీజన్ లో ఒక క్రేజీ ఫిలిం చూసిన ఫీల్ మీలో కలుగుతుంది.
నటిగా నేనెప్పుడూ వెర్సటైల్ గా ఉండాలని ప్రయత్నిస్తుంటాను. నా సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయని ప్రేక్షకులు అనుకోకూడదు. నా క్యారెక్టర్ చూసే సినిమా పేరు చెప్పాలి. అంత ప్రత్యేకంగా సినిమాలు ఉండేలా సెలెక్ట్ చేసుకుంటాను. క్రేజీ కల్యాణంలో కీర్తి పాత్ర కూడా అలా ప్రత్యేకంగా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ప్రస్తుతం తమిళంలో, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్నాను. అవన్నీ పూర్తిగా దేనికది భిన్నమైన చిత్రాలు` అని చెప్పింది అనుపమా పరమేశ్వర్.