ఎన్టీఆర్ "దేవర" కి ‘వేట్టయన్‌- ది హంటర్‌’కి ముడెట్టిన సురేష్ బాబు

First Published Oct 10, 2024, 6:55 AM IST


ఏం "దేవర" టైటిల్ మార్చకుండా దేశం మొత్తం రిలీజ్ చేయలేదా? అంటూ ప్రశ్నించారు సురేష్ బాబు

Rana Daggubati, Suresh Babu, Vettaiyan


రజనీకాంత్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్‌- ది హంటర్‌’. దసరా సందర్భంగా నేడు (గురువారం) రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ ఈ సినిమాను నిర్మించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి ఏసియన్‌ సునీల్‌, దిల్‌ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాను సీడెడ్‌ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్‌ రిలీజ్‌ చేస్తోంది.  అయితే తెలుగులో విడుదలయ్యే చిత్రానికి తమిళ పేరు ఎలా పెడతారంటూ  సోషల్ మీడియాల్లో విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. టైటిల్ వివాదంపై ఈ సినిమాను విడుదల చేస్తున్న దిల్ రాజు, సురేశ్‌ బాబు వివరణ ఇచ్చారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు రానా కూడా పాల్గొన్నారు. 

why vettaiyan telugu version have the same title lyca productions answers the question of telugu audience


నిర్మాత సురేష్‌ బాబు మాట్లాడుతూ...

‘టైటానిక్ టైటిల్ పెట్టినప్పుడు దేశం అంతటా చూసారు. అమలాపురం, పిఠాపురంలోనూ పెద్ద హిట్ చేసారు. కాంతారా టైటిల్ కూడా తెలుగులో లేకపోయినా పెద్ద హిట్ చేసారు. అప్పుడు ఎవరూ టైటిల్ ఇలా పెట్టారేంటని అడగేలేదు. అంతెందుకు రీసెంట్ గా దేవర అనే చిత్రం వచ్చింది. అది తెలుగు టైటిల్, దేశం మొత్తం అదే టైటిల్ తో రిలీజ్ చేసారు.

తమిళంలోనూ, హిందీలోనూ అదే టైటిల్. ముంబైలో ఎవరూ ఈ టైటిల్ ఏంటి అడగలేదే  అన్నారు. ‘వేట్టయన్‌- ది హంటర్‌’ మూవీ మెయిన్‌ టైటిల్‌ ది హంటర్‌. అన్ని భాషల్లోనూ వేట్టయన్‌ ది హంటర్‌ అని రిలీజ్‌ చేస్తున్నారు. హంటర్‌ అనేదే ఈ చిత్రంలోని మెయిన్‌ పాయింట్‌. ఈ చిత్రంలో రజనీకాంత్‌, అమితాబ్‌, ఫాహద్‌, రానా, మంజు వారియర్‌ ఇలా భారీ తారాగణం కనిపిస్తుంది. టి.జె.జ్ఞానవేల్‌ సెన్సిబుల్‌ డైరెక్టర్‌. ఈ మూవీని థియేటర్లో చూడండి. అందరికీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ వస్తుంది’ అని అన్నారు. 

Latest Videos


Actor Rajinikanths Vettaiyan


దిల్ రాజు మాట్లాడుతూ...

తమిళంలోనూ ఒకప్పుడు కేవలం తమిళ టైటిల్స్ మాత్రమే పెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అంతా మారిపోతోంది. సినిమా గ్లోబల్‌గా ఎదిగింది. వేరే భాషల్లో అనువాద టైటిల్స్ దొరికితే పెడుతున్నారు. లేదంటే ఒకే టైటిల్‌ను అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఒకే టైటిల్‌తో ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏ టైటిల్ పెట్టినా కూడా సినిమా బాగుంటేనే ఆడియెన్స్ చూస్తారు. సినిమాని సినిమాలా చూడండి.  అన్నారు. 

vettaiyan


రానా మాట్లాడుతూ...

‘సినిమా అనే దానికి భాష లేదు.. హద్దుల్లేవు. కథను బట్టి ఆ చిత్రం ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఇప్పటి వరకు రజనీకాంత్‌ చేసిన అన్ని సినిమాల్లోకెల్లా వేట్టయన్‌ చాలా భిన్నంగా ఉంటుంది. రియలిస్టిక్‌ మూవీలో ఇన్ని మంచి పాత్రలు ఉండటం చాలా అరుదు. రజనీకాంత్‌ ముందు నిలబడి డైలాగ్‌ చెప్పడం, నటించే ఛాన్స్‌ రావడం చాలా లక్కీ. ఈ చిత్రాన్ని అందరూ చూసి ఎంజారు చేయండి’ అని చెప్పారు. 

Vettaiyan The Hunter, Rajinikanth, Amitabh Bachchan

వివాదంపై నిర్మాణ సంస్ద ప్రకటన


 ఈ సినిమాకి తెలుగు పేరు పెట్టకపోవడంపై నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ స్పందించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ లేఖ విడుదల చేసింది. ‘‘తెలుగులో ‘వేటగాడు’ టైటిల్‌ రిజిస్టర్‌ చేయించాలనుకున్నాం. ఆ పేరు అందుబాటులో లేకపోవడంతో ఒరిజినల్‌ పేరుతోనే రిలీజ్‌ చేయబోతున్నాం.

ఇతర డబ్బింగ్‌ వెర్షన్లకూ ‘వేట్టయన్‌: ది హంటర్‌’ పేరే పెట్టాం. ఎప్పటిలానే తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం. టాలీవుడ్‌కు చెందిన ఎంతోమందితో మేం కలిసి పని చేశాం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘సీతారామం’ వంటి తెలుగు సినిమాలను తమిళ ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చాం. మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. తెలుగు భాష, తెలుగు చలన చిత్ర పరిశ్రమ, తెలుగు మీడియా, తెలుగు ప్రేక్షకులపై లైకా ప్రొడక్షన్స్‌కు గౌరవం ఉంది’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. 

click me!