ముంబైలో చిత్ర పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తి తెలుగు హీరోతో అసలు ప్రభాస్ ఎవరు అని అడిగారట. మహేష్ బాబు గురించి ఆయన చేసిన కామెంట్స్ ఏంటో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
బాహుబలి ముందు వరకు తెలుగు సినిమా పరిస్థితి వేరుగా ఉండేది. అప్పటికి పాన్ ఇండియా మార్కెట్ ఇంకా ఓపెన్ కాలేదు. దీనితో తెలుగు సినిమాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్ మాత్రమే ఉండేది. బాహుబలి రిలీజ్ అయ్యాక తెలుగు సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఒక్కసారిగా పాన్ ఇండియా చిత్రాలు పెరిగాయి. నార్త్ లో తెలుగు సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ క్రెడిట్ మొత్తం రాజమౌళిదే అని చెప్పడం లో సందేహం లేదు.
25
అదే రాజమౌళి గొప్పతనం
ఇదే విషయం గురించి రానా దగ్గుబాటి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి బడ్జెట్ గురించి పట్టించుకోరు. సినిమాకి ఎంత టైం పడుతుంది అనేది ఆలోచించరు. ఆయన మైండ్ లో ఒక గొప్ప ప్రోడక్ట్ తయారు చేయాలి అనేది మాత్రమే ఉంటుంది. అదే ఇతర దర్శకులకు, రాజమౌళి కి తేడా అని రానా అన్నారు.
35
ప్రభాస్ ఎవరు అని అడిగారు
బాహుబలి రిలీజ్ కాకముందు తెలుగు నటుల గురించి కూడా ముంబై వాళ్లకు పూర్తిగా అవగాహన లేదు. బాహుబలి ప్రమోషన్స్ కోసం ముంబైకి వెళ్లాం. అక్కడ ఒక ప్రముఖ వ్యక్తిని కలిశాం. బాహుబలి గురించి చెబుతుంటే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. ఇంతకీ బాహుబలి పాత్రలో ఎవరు నటిస్తున్నారు అని అడిగారు. ప్రభాస్ అని చెప్పా. అసలు ప్రభాస్ ఎవరు అని అడిగారు ? నేను చిన్నపాటి షాక్ కి గురయ్యాయి. అప్పటికి హిందీలో నేను కొన్ని సినిమాలు చేశాను కాబట్టి వాళ్ళకి తెలుసు. ప్రభాస్ గురించి తెలియదు.
మిర్చి చూశారా అని అడిగా.. లేదు అన్నారు.. ఛత్రపతి చూశారా అంటే లేదు అన్నారు. ఆయన మాట్లాడుతూ నాకు తెలుగులో కొందరు ఓల్డర్ యాక్టర్స్ చిరంజీవి, వెంకటేష్ లాంటి వాళ్ళు తెలుసు. ఈ తరం హీరోల్లో నాకు తెలిసింది చీను భర్త మాత్రమే అన్నారు. నాకు మైండ్ బ్లాక్ అయింది. చీను భర్త ఎవరు అని అడిగితే.. నమ్రత శిరోద్కర్ భర్త అని అన్నారు. నాకు దిమ్మ తిరిగిపోయింది. వీళ్ళకి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ విధంగా తెలుసా అని అనుకున్నా. ముంబై వాళ్ళు నమ్రతని చీను అని పిలుస్తారట.
55
బాలీవుడ్ సూపర్ స్టార్లని మించేలా..
బాహుబలికి ముందు ప్రభాస్ ఎవరో కూడా ముంబై వాళ్లకు సరిగ్గా తెలియదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్లని మించే స్థాయిలో ప్రభాస్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.