IMDb Top 10 Most Popular Indian Movies : సినిమాలకు రేటింగ్ ఇచ్చే ఐఎండీబీ సంస్థ, 2025లో ఇండియాలో విడుదలైన టాప్ 10 పాపులర్ సినిమాల జాబితాను రిలీజ్ చేసింది. ఆ లిస్ట్ లో ఉన్న సినిమాలు ఏంటే?
ఐఎండీబీ ఈ ఏడాదికి గాను ఇండియా టాప్ 10 పాపులర్ సినిమాల జాబితాను రిలీజ్ చేసింది. అహాన్ పాండే, అనీత్ భట్ నటించి, మోహిత్ సూరి తీసిన 'సైయారా' ఈ లిస్టులో టాప్‌లో ఉంది. ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా జులై 18న రిలీజైంది.
24
కాంతార చాప్టర్ 1 కి నాలుగో స్థానం
మహావతార్ నరసింహ యానిమేషన్ సినిమా రెండో స్థానంలో ఉంది. తర్వాత చావా, కాంతార చాప్టర్ 1 ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన కూలీ సినిమా ఇందులో ఐదో స్థానంలో నిలిచింది. ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ ఆరో స్థానంలో ఉంది.
34
చిన్న సినిమాలు పెద్ద విజయం..
తర్వాతి మూడు స్థానాల్లో హిందీ సినిమాలు ఉన్నాయి. సితారే జమీన్ పర్, దేవా, రైడ్ 2 చిత్రాలు 7, 8, 9 స్థానాల్లో ఉన్నాయి. డొమినిక్ అరుణ్ తీసిన 'లోకా చాప్టర్ 1: చంద్ర' పదో స్థానంలో నిలిచిన ఏకైక మలయాళ చిత్రం.