బెట్టింగ్ యాప్ కేసుపై స్పందించిన రానా టీమ్
బెట్టింగ్ యాప్‌లను రానా ప్రమోట్ చేశారనే ఆరోపణలపై ఆయన టీమ్ స్పందించింది. రానా స్కిల్ ఆధారిత గేమ్‌లకే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారని, చట్టబద్ధమైన వాటినే ప్రమోట్ చేశారని తెలిపింది.
బెట్టింగ్ యాప్‌లను రానా ప్రమోట్ చేశారనే ఆరోపణలపై ఆయన టీమ్ స్పందించింది. రానా స్కిల్ ఆధారిత గేమ్‌లకే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారని, చట్టబద్ధమైన వాటినే ప్రమోట్ చేశారని తెలిపింది.
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారంటూ ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్, యూట్యూబర్స్‌తో పాటు పలువురు బుల్లితెర నటీనటులపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. విష్ణు ప్రియతో పాటు రీతూ చౌదరి పంజాగుట్ట పీఎస్‌లో పోలీసులకు వివరణ ఇచ్చారు. ఈ కేసులో దగ్గుపాటి రానా పేరు కూడా ఉంది. ఈ నేపధ్యంలో రానా టీమ్ స్పందించింది.
స్కిల్ ఆధారిత గేమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా రానా దగ్గుబాటి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపింది. అయితే ఈ అగ్రిమెంట్ 2017లోనే ముగిసిందని వెల్లడించింది.
కేవలం చట్టబద్ధమైన కంపెనీలకే రానా ప్రమోట్ చేశారని పీఆర్ రిలీజ్ చేసిన ప్రకటనలో పేర్కొంది ఏదైనా ఒప్పందాలు చేసుకునే ముందు రానా దగ్గుబాటి న్యాయ బృందం అన్నింటినీ క్షుణ్ణంగా సమీక్షిస్తుందని వివరించారు. చట్టపరంగా అనుగుణంగా ఉంటేనే రానా అంగీకరిస్తారని తెలిపారు.
‘‘రానా స్కిల్ బేస్డ్ గేమ్ యాప్‌నకు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారు. అది కూడా కొన్ని ప్రాంతాల వరకే ప్రసారమైంది. చట్టబద్ధంగా అనుమతించిన వాటికే రానా ఆమోదం తెలిపారు. ఒప్పందాలు చేసుకునే ముందు రానా దగ్గుబాటి లీగల్ టీమ్ ఆ సంస్థకు సంబంధించిన అన్ని విషయాలను క్షుణ్ణంగా సమీక్షిస్తుంది.
చట్టపరమైన సమీక్ష తర్వాతే, రానా ఆ ప్లాట్‌ఫామ్‌కు ప్రచారం చేయడానికి అంగీకరించారు. జూదానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు ఈ ఆన్‌లైన్ గేమ్‌లను గుర్తించింది. ఈ గేమ్‌లు అవకాశం మీద కాకుండా నైపుణ్యం మీద ఆధారపడి ఉన్నాయని, అందకు చట్టబద్ధంగా అనుమతించినట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థకూ ఆయన ప్రచారకర్తగా వ్యవహరించడం లేదు’’- టీమ్ రానా