నేను చేసింది తప్పే కానీ : బెట్టింగ్‌ యాప్‌ కేసుపై ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు

Published : Mar 21, 2025, 07:11 AM IST

బెట్టింగ్ యాప్‌ల వివాదంపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. 2016లో ఒక యాప్‌ను ప్రమోట్ చేసినట్లు అంగీకరించారు, కానీ ఏడాది తర్వాత ఒప్పందం రద్దు చేసుకున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను ఏ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేయడం లేదని స్పష్టం చేశారు.

PREV
13
నేను చేసింది తప్పే కానీ  : బెట్టింగ్‌ యాప్‌ కేసుపై ప్రకాశ్‌ రాజ్‌  సంచలన వ్యాఖ్యలు
Prakash Raj issues clarification on betting app controversy in telugu

 
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.  ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఇన్ల్ఫుయెన్సర్లు, సినీ సెలబ్రిటీలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

వరుసగా ఒక్కొక్కరిపై కేసులు నమోదు చేస్తున్నారు. రీసెంట్‌గా పంజాగుట్ట పీఎస్‌లో 11 మందిపై, ఇప్పుడు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో దాదాపు 25 మంది సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ప్రకాశ్ రాజ్ పేరు కూడా ఉంది. 

23
Prakash Raj issues clarification on betting app controversy in telugu


బెట్టింగ్ యాప్స్ కేసు వ్యవహారంపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. తాను కూడా బెట్టింగ్‌ యాప్‌ను ప్రమోట్ చేసినట్లు వెల్లడించారు. అయితే 2016 జూన్‌లో ఓ యాడ్‌ చేసినట్లు తెలిపారు.

అది కేవలం ఏడాది పాటు మాత్రమే చేసుకున్న అగ్రిమెంట్ అని వెల్లడించారు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని ఆ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఏ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వీడియోను విడుదల చేశారు.
 

33
Prakash Raj issues clarification on betting app controversy in telugu


 ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..' బెట్టింగ్ యాప్‌ కేసు గురించి ఇప్పుడే తెలిసింది. 2016లో ఓ యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను ఆ యాడ్ చేసిన మాట నిజమే. కానీ ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నా.

2017లోనూ ఒప్పందం పొడిగిస్తామని కంపెనీ వాళ్లు అడిగారు. కానీ నేను ఆ యాడ్‌ను ప్రసారం  చేయవద్దని కోరా. 9 ఏళ్ల కిందట ఏడాది పాటు ఒప్పందంతో చేసుకుని ఈ యాడ్ చేశా. ఇప్పుడు ఏ గేమింగ్ యాప్‌కు ప్రచారకర్తగా పనిచేయడం లేదు.

2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే సోషల్ మీడియాలో నా ప్రకటన వాడారు. నా ప్రకటన వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపా. ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి నాకు ఎలాంటి సందేశం రాలేదు. ఒకవేళ పిలిస్తే నేను చేసిన ప్రకటనపై పోలీసులకు వివరణ ఇస్తా' అని అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories