ఆ హీరోయిన్ ను పిచ్చిగా ప్రేమించిన రానా దగ్గుబాటి.. ?పెళ్ళి ఎందుకు చేసుకోలేదంటే...?

First Published | Nov 20, 2022, 5:48 PM IST

టాలీవుడ్ లో డిఫరెంట్ గా తన కెరీర్ ను తీసుకెళ్తున్న రానా దగ్గుబాటి కనిపించడు కాని.. ఆయన మంచి ప్లే బాయ్ అని అంటుటారు టాలీవుడ్ జనాలు. ప్రస్తుతం పెళ్లి చేసుకున్ని కామ్ గా కాపురం చేసుకుంటున్న రానా దగ్గుబాటి ఓ కన్నడ హీరోయిన్ ను పిచ్చిగా ప్రేమించాడట. 
 

టాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమా కుటుంబాలు చాలా ఉన్నాయి. అందులో దగ్గుబాటివారి ఫ్యామిలీ కూడా ఒకటి. నిర్మాతలు, హీరోల, స్టూడియోతో తెలుగు ఫిల్మ్  ఇండస్ట్రీలో తమకంటూ ఓ బ్రాండ్ ను ఏర్పటు చేసుకున్నారు. ఇక ఈ ఫ్యామిలీ నుంచి వెంకటేష్ తరువాత హీరోగా ఎంటర్ అయ్యింది.. నిర్మాత సురేష్ బాబు పెద్ద కొడుకు రానా దగ్గుబాటి. 
 

టాలీవుడ్‌లో ద‌గ్గుబాటి ఫ్యామిలీకి ఎంతో చ‌రిత్ర ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి  నిర్మాతరామానాయుడు త‌ర్వాత ఆయ‌న వార‌సులు వెంక‌టేష్ హీరోగా, సురేష్‌బాబు స్టార్ ప్రొడ్యుస‌ర్‌గా కొన‌సాగుతూ వ‌స్తున్నారు. ఇక మూడో త‌రంలో ఇప్ప‌టికే సురేష్‌బాబు పెద్ద కుమారుడు రానా  తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుండగా.. రానా తమ్ముడు అభిరామ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 


టాలీవుడ్ హీరోలందరిలో రానాది డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన చాలా మంచివాడు.. అంతే కాదు  మంచి ప్లే బాయ్ అని కూడా టాలీవుడ్ అంతటా తెలుసు. రాన కు  ప‌ర్స‌న‌ల్ గా చాలా మందితో అఫౌర్లు ఉన్నాయంటూ ఎప్పటినుంచో రూమర్స్ ఉన్నాయి. ఈ వార్తల వల్ల చాలా కాస్లు కాంట్ర‌వ‌ర్సీల‌తో కాలక్షేపం చేసేవాడు రానా దగ్గుబాటి. 
 

రానా చాలా మంది హీరోయిన్లతో అఫైర్లు నడిపాడట. అయితే ఈ మధ్య కాలంలో ఆయన పెళ్లికి ముందు మాత్రం ఓ హీరోయిన్ ను సిన్సియర్ గా ప్రేమించినట్టు టాలీవుడ్ టాక్. రానాకు మిహికా బ‌జాబ్‌తో పెళ్లి జ‌ర‌గ‌డానికి   ముందే రానా – రాగిణిని ప్రేమించినట్టు న్యూస్  బాగా వైర‌ల్ అయ్యంది. 

అయితే ఇక్కడ విచిత్రం ఏంటీ అంటే.. అస‌లు రానా – రాగిణీ కలిసి  ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. ఆమె 2009లో క‌న్న‌డ‌లో వ‌చ్చిన వీర మ‌డ‌క్క‌రి సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. తెలుగులో నాని హీరోగా వ‌చ్చిన జెండా పైక‌పిరాజు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా స‌రిగా ఆడ‌క‌పోవ‌డంతో ఆమెను ఇక్క‌డ ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు.
 

అయితే రాగిణి  హీరోయిన్ గా రావడం కంటే ముందు మోడ‌ల్ గా చేసింది. దాంతో రానా కూడా మోడల్ కావడంతో అలా ఏర్పడిన ప‌రిచ‌యంతో వీరిద్ద‌రి మ‌ధ్య కొంత సమ్ థింగ్ సమ్ థింగ్ నడిచిందని టాక్.   

అయితే ఆ త‌ర్వాత డ్ర‌గ్స్ ఇష్యూలో సంజ‌న గ‌ల్రానీతో పాటు రాగిణిపై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆమె కెరీర్ మ‌రింత కాంట్ర‌వ‌ర్సీ అయ్యింది. ప్ర‌స్తుతం రాగిణి న‌న్నొబ్బ బ‌ర‌తియా అనే క‌న్న‌డ సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో ఆమె గాయ‌ప‌డి ప్ర‌స్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటోంది.

అయితే అంతకు ముందు త్రిషతో కూడా రానా అఫైర్ ఉందంటూ వార్తలు వినిపించాయి. స‌హ‌జంగానే అప్ప‌టికే త్రిష‌తో బ్రేక‌ప్ అయ్యి ఉండ‌డంతో పాటు రానా ప్లే బాయ్ కావ‌డంతో రానా – రాగిణి కి కనెక్ట్ అయ్యాడు అనేది రూమర్.  ఇక సోషల్ మీడియాకు కొంచెం క్లూ దొరికితే వదలరు కదా.. ఇక అల్లేశారు. వాటికి బలం చేకూర్చుుతూ ఇద్దరు ఒక సారి దొరికేశారు కూడా. 

ఓ సారి చెన్నై చిన్న‌ది త్రిష‌తో మందుకొట్టి తూలుపోతూ మీడియా కెమేరాల‌కు చిక్కాడు.అప్పుడు మీడియా వాళ్లు ఫొటోలు తీస్తున్నా.. త్రిష‌ను ప‌ట్టుకుని త‌న కారులో వెళ్లిపోయాడు. దీనిపై చాలా రాద్దాంత‌మే న‌డిచింది. త్రిష‌తో చాలా రోజుల పాటు డీప్‌ల‌వ్‌లో ఉన్నాడ‌ని అంటారు. అయితే త్రిష‌ను త‌మ ఇంటి కోడ‌లిగా చేసుకోవ‌డం సురేష్‌బాబుకు ఏ మాత్రం ఇష్టంలేదు. ఆ త‌ర్వాత క‌న్న‌డ హీరోయిన్ రాగిణి ద్వివేదితో కూడా రానా ప్రేమ‌లో ఉన్న‌ట్టు పుకార్లు అయితే వినిపించాయి.

Latest Videos

click me!