రానా దగ్గుబాటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం థియేటర్స్ లో సందడి చేస్తోంది. మలయాళీ చిత్రం అయ్యప్పనుమ్ కోషియం చిత్రానికి ఇది రీమేక్. మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కథని తెలుగు నేటివిటీకి అనుగుణంగా, పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా మార్చారు. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సితార ఎంటెర్టైనెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో విజయవంతంగా దూసుకుపోతోంది.