ఆ తర్వాత సుబ్బయ్య కూతురు పెళ్ళికి తాంబూలం ఇవ్వడానికి నేను రామచంద్ర (Ramachandra) గారు వెళ్తాము అని జానకి తాంబూలం తీసుకుంటుంది. ఆ తర్వాత మల్లిక (Mallika) , సుబ్బయ్య కూతురు పెళ్ళికి బావగారు ఒక్కరు వెళ్లారని జానకి వెళ్లలేదని జ్ఞానాంబ కు చాడీలు చెబుతుంది. కానీ జ్ఞానాంబ అది నమ్మక పోవడంతో మల్లిక ఇంటి పక్కన లీలావతి ఆంటీ ని పిలిపించి మరి చెప్పిస్తుంది.