ముంబయిలో జరిగిన ఈ ట్రైలర్ ఈవెంట్‌లో ప్రభాస్, పూజాహెగ్డే, దర్శకుడు రాధాకృష్ణకుమార్, నిర్మాతలు వంశీ, వక్కీ, భూషణ్ కుమార్ పాల్గొని మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇందులో పూజా పాల్గొనడం విశేషంగా చెప్పొచ్చు. ఈసినిమా విషయంలో పూజాకి కాస్త గ్యాప్ వచ్చిందని, ఆమె ప్రమోషన్ విషయాల్లో సహకరించడం లేదనే రూమర్స్ వచ్చిన నేపథ్యంలో వాటికి చెక్ పెట్టింది పూజా. ముంబయిలో ఈవెంట్‌లో పాల్గొని హల్‌చల్ చేసింది.