తనూజపై పుకార్లు పుట్టిస్తూ అడ్డంగా దొరికిపోయిన రమ్య మోక్ష.. భరణి విషయంలో దివ్యని నిలదీసిన మాధురి

Published : Oct 18, 2025, 11:47 PM IST

Bigg Boss Telugu 9: బిగ్ బాస్‌ తెలుగు 9 41వ ఎపిసోడ్‌(శనివారం)లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ కి ఉన్న పవర్‌ గురించి నాగార్జున మాట్లాడారు. అదే సమయంలో రమ్య, మాధురి, రీతూ, పవన్‌, కళ్యాణ్‌ల రియాలిటీ బయటపెట్టారు. 

PREV
15
రమ్య మోక్ష రియాలిటీ బయటపెట్టిన నాగార్జున

బిగ్‌ బాస్‌ తెలుగు 9 షో ప్రారంభమై ఆరు వారాలు పూర్తి కావొస్తుంది. ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ కూడా జరిగాయి. ఆరుగురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వీరి రాకతో హౌజ్‌లో రచ్చ ప్రారంభమైందని చెప్పొచ్చు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష.. పాత కంటెస్టెంట్ల రిలేషన్స్ పై ఫోకస్‌ పెట్టారు. వీరి ఎంట్రీ తర్వాత వచ్చిన మొదటి వీకెండ్‌ కావడంతో నాగార్జున వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కి సంబంధించిన తప్పొప్పులు నిలదీశారు. వారికి వచ్చిన పవర్స్ ఉండాలో లేదో తేల్చేశారు.

25
వీరి పవర్స్ కట్‌

వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్లకి రావడం, రావడంతోనే ఒక పవర్‌ ఇచ్చి హౌజ్‌లోకి పంపించారు నాగార్జున. సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి చెబుతా అన్నారు. ఇప్పుడు శనివారం ఎపిసోడ్‌లో ఆ విషయాలను ప్రస్తావించారు. ఈ వారం రోజులు ఎవరు ఎలా ఆడారు? ఎవరు ఆ పవర్స్ కలిగి ఉండటానికి అర్హులు అనేది ప్రశ్నించారు. ఇందులో కంటెస్టెంట్ల అభిప్రాయాన్ని, ఆడియెన్స్ ఒపీనియన్‌ని కూడా తీసుకున్నారు. దివ్వెల మాధురి తన పవర్‌కి అర్హురాలు కాదని తేల్చారు. హౌజ్‌మేట్స్ తోపాటు, ఆడియెన్స్ కూడా అదే చెప్పారు. ఆ తర్వాత రమ్యకి పవర్‌ ఉండాలని కంటెస్టెంట్లతోపాటు, ఆడియెన్స్ కూడా అభిప్రాయపడ్డారు. ఆయేషా జీనత్‌ విషయంలోనూ అలాంటి అభిప్రాయమే వచ్చింది. శ్రీనివాస సాయికి కూడా ఉండాలని చెప్పారు. కాకపోతే నిఖిల్‌ నాయర్‌, గౌరవ్‌లు సంపాదించుకుంటే బాగుంటుందని కంటెస్టెంట్లు, ఆడియెన్స్ అభిప్రాయపడ్డారు. దీంతో ఇప్పుడు రమ్య, శ్రీనివాస సాయి, ఆయేషాలకు మాత్రమే తమ పవర్స్ దక్కించుకున్నారు, మిగిలిన ముగ్గురు ఆ పవర్స్ ని కోల్పోయారు.

35
కళ్యాణ్‌ చేస్తోన్న మిస్టేక్‌ ఏంటో చెప్పిన రమ్య

ఇదిలా ఉంటే శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్ల తప్పులను ఎత్తిచూపుతారని విషయం తెలిసిందే.  దివ్వెల మాధురి, కళ్యాణ్‌ల మధ్య జరిగిన గొడవ గురించి ప్రస్తావించారు. ఇందులో చెప్పాలనుకున్న విషయం తప్పు కాదని, చెప్పే విధానం తప్పు అని మాధురికి చెప్పాడు. ఆ తర్వాత రమ్య మోక్ష, కళ్యాణ్‌ ల విషయంలోనూ అదే జరిగింది. కళ్యాణ్‌ గురించి పుకార్ రమ్య వ్యాపింప చేసిన నేపథ్యంలో అలాంటి ప్రచారం సరికాదని, మాట తీరుని బట్టి మన అర్హత నిర్ణయించబడుతుందని స్పష్టం చేశారు. తనూజ విషయంలో కళ్యాణ్‌ వ్యవహారించిన తీరుని రమ్య ప్రశ్నించింది. అమ్మాయిల విషయంలో తన తీరుని కూడా మార్చుకోవాలని తెలిపింది. నాగార్జున కూడా ఆ విషయాన్ని కళ్యాణ్‌కి సూచించాడు. ఈ క్రమంలో రీతూ చౌదరీ, పవన్‌ల లవ్‌ ట్రాక్‌ని కూడా చర్చించారు. రీతూ క్లారిటీ ఉండగా, పవన్‌ కన్‌ఫ్యూజన్‌ వ్యక్తం చేశాడు.

45
తనూజ గురించి పుకార్లు పుట్టించిన రమ్య

తనూజని కన్‌ఫెషన్‌ రూమ్‌కి పిలిపించిన నాగార్జున.. ఆమెకి రెండు వీడియోలు చూపించారు. కళ్యాణ్‌తో తన తీరు గురించి రమ్య మోక్ష.. మాధురితో, అలాగే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లతో మాట్లాడిన విషయాలను చూపించాడు. రమ్య మోక్ష..వాళ్లతో తనూజ గురించి బ్యాడ్‌గా చెప్పే ప్రయత్నం చేస్తోంది. కళ్యాణ్‌ విషయంలో తనూజనే అవకాశం ఇస్తుందని చెప్పారు. కళ్యాణ్‌ చేయి వేయడం ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలి కదా, ఎందుకు అక్కడే ఉంటుందన్నారు. మరో సందర్భంలో తనూజకి కూడా లోపల ఉందని చెప్పారు. ఇది చూసి తనూజ షాక్‌ అయ్యారు. అలాంటిది లేదని, ఆ విషయంలో తాను క్లారిటీతోనే ఉన్నట్టు తెలిపారు. ఇకపై ఈ రిలేషన్‌కి సంబంధించి మరింత స్పష్టతతో వ్యవహరిస్తానని చెప్పింది.

55
రమ్య అసలు రియాలిటీ ఇదేనా

అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో రమ్య మోక్ష నడిపించిన గాసిప్‌ల వ్యవహారం వేరే స్థాయిలో ఉందని చెప్పొచ్చు. చూడ్డానికి అందంగా, క్యూట్‌గా ఉన్న ఆమె తెరవెనుక ఇలాంటి గాసిప్‌ వ్యవహారం నడపించడం అందరికి షాకిస్తుంది. ఆమెపై గతంలో ఒక మంచి ఒపీనియన్‌ ఉండేది, కానీ ఇప్పుడు ఆమెని చూస్తుంటే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమెపై ఆడియెన్స్ లో ఆలోచనని కూడా మార్చేస్తుందని చెప్పొచ్చు. ఇక శనివారం ఎపిసోడ్‌లో దివ్వెల మాధురినీ కొత్త రేషన్‌ మేనేజర్‌ చేశాడు నాగ్‌. మరోవైపు ఇమ్మాన్యుయెల్‌తో సరదా కన్వర్జేషన్‌ చేశాడు.  రమ్య, ఆయేషాల అందం గురించి మాట్లాడాడు. ఇద్దరూ అందంగా, క్యూట్‌గా ఉన్నారని చెప్పొడం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories