రమ్యకృష్ణ ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించారు. 1990 కాలంలో టాప్ స్టార్‌గా వెలిగిన ఆమె అటు గ్లామర్ పాత్రలు, మరోవైపు ఇన్నోసెంట్ రోల్స్, డీ గ్లామర్ పాత్రలు చేసి మెప్పించింది. సౌందర్య, మీనా, రోజా, రంభ, ఆమని వంటి వారికి ధీటుగా రాణించి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదే జోరుతో ముందుకు సాగుతుంది.