తమిళం, తెలుగు భాషల్లో ఐశ్వర్య బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూనే వస్తోంది. హిట్.. ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అభిమానులు, ఫ్యాన్స్ ను అలరిస్తోంది. చివరిగా తెలుగులో ఐశ్వర్య ‘టక్ జగదీష్’,‘రిపబ్లిక్’ చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం పదికిపైగా తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తోంది.