Ramya Krishnan: రమ్యకృష్ణ నెల సంపాదన ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌, స్టార్‌ హీరోలు కూడా జుజూబీనే

Published : Feb 10, 2025, 02:15 PM IST

Ramya Krishnan: సీనియర్‌ హీరోయిన్‌ రమ్యకృష్ణ చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. కానీ ఆదాయం మాత్రం కోట్లల్లో ఉంది. ఎలా వస్తుంది? నెలకు ఎంత సంపాదిస్తుందనేది చూద్దాం.   

PREV
15
Ramya Krishnan: రమ్యకృష్ణ నెల సంపాదన ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌, స్టార్‌ హీరోలు కూడా జుజూబీనే
ramya krishnan

Ramya Krishnan: సీనియర్‌ హీరోయిన్‌ రమ్యకృష్ణ 80-90లో తెలుగు సినిమాని ఊపేసిన హీరోయిన్. గ్లామర్‌ బ్యూటీగా విశేష గుర్తింపు తెచ్చుకుంది. అందరు టాప్‌ స్టార్స్ తోనూ జోడీ కట్టింది. అటు పాజిటివ్‌ రోల్స్, మరోవైపు నెగటివ్‌ రోల్స్ కూడా చేసి మెప్పించింది. పాత్ర ఏదైనా రక్తికట్టించడంలో రమ్యకృష్ణ దిట్ట. 

25
ramya krishnan

ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నారు. అడపాదడపా పవర్‌ఫుల్‌ రోల్స్ చేసుకుంటూ వస్తున్న రమ్యకృష్ణకి కెరీర్‌ బెస్ట్ మూవీ `బాహుబలి`తో పడింది. ఇందులో శివగామిగా చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. అటు రాజమౌళిని కూడా సర్‌ప్రైజ్‌ చేసింది. అనంతరం ఇప్పుడు అడపాదడపా బలమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది రమ్యకృష్ణ. 
 

35
ramya krishnan

యాబై ఏళ్లు పడిన రమ్యకృష్ణ చేసే సినిమాలు తక్కువే. ఏడాదికి ఒకటి, రెండుమూవీస్‌లోనే మెరుస్తుంది. కానీ ఆమె సంపాదన తెలిస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. రమ్యకృష్ణ సంపాదన నెలకు కోట్లల్లో ఉంటుందట. ఆమె నెలకు సుమారు ఐదు కోట్ల వరకు సంపాదిస్తుందని తెలుస్తుంది. మరి ఇంత ఆదాయం ఎలా వస్తుందనేది చూస్తే, 
 

45
ramya krishnan

కేరళాలో రమ్యకృష్ణకి ఐదు బ్యూటీపార్లర్స్ ఉన్నాయట. తన పేరుమీదనే ఈ షాప్స్ నిర్వహిస్తుందని తెలుస్తుంది. అలాగే హైదరాబాద్‌ మూడు జ్యూవెల్లరీ షాపులు కూడా ఉన్నాయి తెలుస్తుంది. వటి రూపంలో రమ్యకృష్ణకి భారీగానే ఆదాయం వస్తుందని, సినిమాలు, యాడ్స్, బిజినెస్‌ ల నుంచి సుమారు ఐదు కోట్ల వరకు ఆదాయం వస్తుంది తెలుస్తుంది. 
 

55
ramya krishnan

ఈ లెక్కన రమ్యకృష్ణతో పోల్చితే స్టార్‌ హీరోలు కూడా జుజూబీ అనే చెప్పాలి. ఓ హీరోయిన్‌కి ఈ స్థాయిలో ఆస్తులంటూ మామూలు విషయం కాదు. అయితే ఇందులో నిజమెంతా అనేది తెలియదు(facts check). జస్ట్ సోషల్ మీడియాలో సర్కిల్‌ అవుతున్ సమాచారం మాత్రమే. ఆడియెన్స్, ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ మేరకు అందించడం జరుగుతుంది. ఇక రమ్యకృష్ణ చివరగా తెలుగులో `గుంటూరు కారం`, `పురుషోత్తముడు` అనే చిత్రాల్లో నటించారు. 

read  more: Mahesh-Namrata: పెళ్లికి ముందు నమ్రతకి మహేష్‌ బాబు పెట్టిన కండీషన్‌, వామ్మో ఇలా ఉన్నాడేంటి అనుకున్న హీరోయిన్‌

also read: ప్రభాస్‌, మహేష్‌, పవన్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, చరణ్‌ మూవీస్‌ లైనప్‌.. 3,4 ఏళ్లు పాన్‌ ఇండియా సినిమాల జాతరే
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories