Published : Feb 10, 2025, 01:12 PM ISTUpdated : Feb 10, 2025, 01:16 PM IST
Mahesh-Namrata: మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల వివాహ బంధానికి 20 ఏళ్ళు. `వంశీ` సినిమా సెట్లో మొదలైన ప్రేమకథ. పెళ్లికి ముందు మహేష్ బాబు పెట్టిన షరతు ఏమిటి?
Mahesh-Namrata: సౌత్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల వివాహ బంధానికి 20 ఏళ్ళు. 2005లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నారు. వీరికి కొడుకు గౌతమ్, కూతురు సితార ఉన్న విషయం తెలిసిందే. సెకండరీ ఎడ్యూకేషన్ చేస్తున్నారు ఈ ఇద్దరు పిల్లలు.
27
`వంశీ` సినిమా సెట్లో మహేష్, నమ్రత
`వంశీ` సినిమాలో మహేష్ బాబు, నమ్రత కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత అది బలపడింది. ఇద్దరు ఒకరినకొరు అర్థం చేసుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకున్నారు.
37
మహేష్, నమ్రతల స్నేహం, ప్రేమ
`వంశీ` సినిమాలో కలిసి నటిస్తున్నప్పుడు మహేష్, నమ్రతల మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ రహస్యంగా డేటింగ్ చేయడం మొదలుపెట్టారు.
47
మహేష్ పెట్టిన షరతు
ఐదేళ్లు డేటింగ్ చేసిన తర్వాత మహేష్, నమ్రత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి ముందు నమ్రత సినిమాలు మానేయాలని మహేష్ షరతు పెట్టాడు. నమ్రత అంగీకరించింది.
57
మహేష్, నమ్రతల వివాహం
2005 ఫిబ్రవరి 10న మహేష్, నమ్రత వివాహం ఘనంగా జరిగింది. ముంబైలో జరిగిన ఈ వేడుకకు చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. పెళ్లైన తర్వాత నమ్రత సినిమాలు మానేసింది.
67
మహేష్, నమ్రతల పిల్లలు
మహేష్, నమ్రతలకు ఇద్దరు పిల్లలు. గౌతమ్, సితార. ఇద్దరూ చదువుకుంటున్నారు. సితార లైమ్ లైట్ లో ఉంటుంది. కొన్ని ఫోటో షూట్ లలో కూడా పాల్గొంది. మొదట్లో మహేష్ ని చూసి నమ్రత కూడా ఆశ్చర్యపోయిందట. మహేష్‌చాలా సైలెంట్‌గా, ఇంట్రోవర్ట్ గా ఉండేవాడట. దీంతో వామ్మో ఈయనేంటి ఇలా ఉన్నాడని అనుకునేదట. తానే ఆయన్నిచాలా మారిపోయాడని, తాను మార్చేసినట్టు తెలిపింది నమ్రత.
77
మహేష్, నమ్రతల విలాసవంతమైన బంగ్లా
మహేష్, నమ్రతలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. ఈ బంగ్లా విలువ దాదాపు 30 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం మహేష్ బాబు. `ఎస్‌ఎస్‌ఎంబీ29` చిత్రంలో నటిస్తున్నారు.