రమ్యకృష్ణ కెరీర్‌ని మార్చేసిన మూవీ ఏంటో తెలుసా? అంతకు ముందు దారుణమైన అవమానాలు, సినిమాకి బుక్‌ చేసుకుని తొలగించారు

Published : Jul 15, 2025, 07:23 AM IST

రమ్యకృష్ణ గ్లామర్‌ పాత్రలే కాదు శక్తివంతమైన పాత్రలతోనూ మెప్పించారు. పాజిటివ్‌తోపాటు నెగటివ్‌ రోల్స్ కూడా చేశారు. శివగామిగా నటవిశ్వరూపం చూపించారు. 

PREV
16
`నరసింహ`లో నీలాంబరిగా రమ్యకృష్ణ విశ్వరూపం

రమ్యకృష్ణలో అద్భుతమైన నటి ఉందని గుర్తించిన సినిమా `నరసింహ`. రజనీకాంత్‌ హీరోగా వచ్చిన చిత్రమిది. ఇందులో రమ్యకృష్ణతోపాటు సౌందర్య హీరోయిన్‌గా నటించింది. 

ఈ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో నటించి అదరగొట్టింది. ఇంకా చెప్పాలంటే నటిగా విశ్వరూపం చూపించింది. 

ఆ తర్వాత రమ్యకృష్ణ కెరీర్‌ మరో లెవల్‌కి టర్న్ తీసుకుంది. మరోవైపు `బాహుబలి`లోని శివగామి పాత్ర ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్ కి బిగ్‌ బ్రేక్‌ ఇచ్చిందని చెప్పొచ్చు.

26
కెరీర్‌ ప్రారంభంలో రమ్యకృష్ణకి అవమానాలు

ఇదిలా ఉంటే కెరీర్‌ ప్రారంభంలో రమ్యకృష్ణ కెరీర్‌ని మార్చేసిన మూవీ ఉంది. అంతకు ముందు ఆమె చాలా దారుణమైన అవమానాలు ఫేస్‌ చేసింది. 

చాలా మంది మేకర్స్ ఆమెని బుక్‌ చేసుకుని తీరా చివరి నిమిషంలో తొలగించే వారట. అలాంటి సమయంలో రమ్యకృష్ణకి బిగ్‌ లైఫ్‌ ఇచ్చిన మూవీ `అల్లరి మొగుడు`. 

కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రమిది. ఇందులో మోహన్‌ బాబు హీరో. 1992లో విడుదలైన ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. ఈ సినిమాతో రమ్యకృష్ణ కెరీర్‌ మారిపోయింది.  స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది.

36
`అల్లుడుగారు`తో గుర్తింపు

అంతకు ముందు మోహన్‌ బాబుతోనే రాఘవేంద్రరావు `అల్లుడుగారు` తీశారు. ఇందులో రమ్యకృష్ణ రెండో హీరోయిన్. అయినా మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లోనే `అల్లరి మొగుడు`  వచ్చింది. ఇది పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. 

దీంతో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది రమ్యకృష్ణ. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సి అవసరం రాలేదు. వరుసగా ఆఫర్లు క్యూ కట్టడంతో తీరిక లేకుండా గడిపింది. తెలుగు, తమిళంలో బిజీ హీరోయిన్‌ అయిపోయింది. 

46
రమ్యకృష్ణ స్టేజ్‌పైనే ఎమోషనల్‌

ఇదిలా ఉంటే `అల్లరి మొగుడు` సినిమా వంద రోజుల వేడుకలో రమ్యకృష్ణ ఎమోషనల్‌ అయ్యింది. ఈ చిత్రానికి ముందు తాను ఫేస్‌ చేసిన అవమానాలు తలుచుకుని స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకుంది.  

 తనని చాలా మంది దురదృష్టవంతురాలు అనేవారు. అంతేకాదు కొందరు నిర్మాతలు సినిమాల్లో ఓకే చేసి, తర్వాత తొలగించారని, చాలా సార్లు ఇలా జరిగిందని, ఆ సమయంలో రాఘవేంద్రరావు తనని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన ఇంతటి విజయాన్ని అందించారని రమ్యకృష్ణ రాఘవేంద్రరావు, హీరో మోహన్‌బాబు, నిర్మాతకు థ్యాంక్స్ చెప్పింది రమ్యకృష్ణ.

56
అవమానాలు గుర్తు చేసుకుని స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ

ఈ క్రమంలో ఆమె భావోద్వేగాన్ని ఆపుకోలేక మాట్లాడే క్రమంలోనే స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకుంది. స్పీచ్‌ ఇవ్వలేని పరిస్థితిలో ఆమె వెనుతిరిగింది.

 ఆ సమయంలో చాలా సేపు రమ్యకృష్ణ భావోద్వేగాన్ని కంట్రోల్‌ చేసుకోలేకపోయిందని రాఘవేంద్రరావు తెలిపారు. ఇదంతా రాఘవేంద్రరావు సినీ ప్రస్థానాన్ని తెలియజేసేలా సాగే `సౌందర్యలహరి` షోలో రమ్యకృష్ణ, రాఘవేంద్రరావు వెల్లడించారు. 

ఇవాళ్ల తనని కాదనుకున్నవాళ్లు, తొలగించినవాళ్లు మళ్లీ నువ్వే కావాలి అని అనేలా చేస్తాను అని ఆ సమయంలోనే రమ్యకృష్ణకి మాటిచ్చాడట రాఘవేంద్రరావు. ఆ తర్వాత అదే చేశాడు.

 దీంతో రమ్యకృష్ణ టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. గ్లామర్‌ పాత్రలతోనే కాదు, అద్భుతమైన నటనతోనూ మెప్పించింది. విలక్షణ నటిగా రాణించింది.

66
సెకండ్‌ ఇన్నింగ్స్ లో స్ట్రాంగ్ రోల్స్ తో మెప్పిస్తోన్న రమ్యకృష్ణ

సెకండ్‌ ఇన్నింగ్స్ లోనూ బలమైన పాత్రలతో మెప్పిస్తోంది రమ్యకృష్ణ. `బాహుబలి`లోని శివగామి పాత్ర ఆమెకి మరో బిగ్‌ టర్న్ అని చెప్పొచ్చు. ఆ మధ్య వచ్చిన `రంగమార్తాండ`లోనూ మరో బలమైన పాత్రలో అలరించింది. మళ్లీ ఆమెకి శివగామి రేంజ్‌ పాత్రలు పడటం లేదు. దీనికితోడు చాలా సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తోంది రమ్యకృష్ణ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories