Ramya Krishna: కృష్ణవంశీతో విడాకులు నిజమేనా.. ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఎట్టకేలకు బయటపెట్టిన రమ్యకృష్ణ

Published : Nov 16, 2026, 09:12 AM IST

రమ్యకృష్ణ, కృష్ణవంశీ వైవాహిక జీవితం గురించి చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆ వార్తలపై తాజాగా రమ్యకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
Ramya Krishna

అలనాటి గ్లామర్ క్వీన్ రమ్యకృష్ణ టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, శ్రీకాంత్ లాంటి హీరోలందరితో ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ క్యరెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికీ రమ్యకృష్ణ హవా తగ్గలేదు అనే చెప్పాలి. బాహుబలి, బంగార్రాజు, జైలర్ 2 ఇలా అద్భుతమైన చిత్రాలలో రమ్యకృష్ణకి అవకాశాలు వస్తున్నాయి.

25
రమ్యకృష్ణ విడాకులు ?

రమ్యకృష్ణ వ్యక్తిగత జీవితం గురించి తరచుగా వార్తలు వస్తూనే ఉంటాయి. 2003లో రమ్యకృష్ణ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు సంతానం. అయితే చాలా కాలంగా రమ్యకృష్ణ, కృష్ణ వంశీ వేర్వేరుగా జీవిస్తునట్లు ప్రచారం జరుగుతోంది. అలాగని వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు కూడా ఎక్కడా అధికారికంగా వార్తలు రాలేదు.

35
వేర్వేరుగా ఉంటున్నాం

అసలు రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడిపోయారా.. కలసి ఉన్నారా అనే ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీతో మ్యారేజ్ లైఫ్ గురించి స్పందించారు. రమ్యకృష్ణ మాట్లాడుతూ.. మేము ఇప్పటికీ భార్య భర్తలమే. కానీ మేమిద్దరం ఒక స్పష్టమైన అవగాహనతో, సంతోషంగా వేరువేరు సిటీల్లో ఉంటున్నాం. దానికి కారణం మా వృత్తే.

45
కొడుకు కోసమే

నేను సీరియల్స్ లో నటించడం ప్రారంభించాక షూటింగ్ కారణాల వల్ల 15 రోజులకు ఒకసారి చెన్నైకి వెళ్లేదాన్ని. ఆ టైంలో మా కొడుకు అనారోగ్యానికి గురయ్యేవారు. కాబట్టి వాడితో ఉండడంతో నేను కూడా ఒకే సిటీలో ఉంటున్నా. ఆ విధంగా కృష్ణ వంశీ ఒకచోటు.. నేను నా కొడుకు మరో చోట ఉంటున్నాం.

55
కృష్ణవంశీ, నేను మంచి స్నేహితులం

నేను కృష్ణవంశీ భార్యాభర్తలుగా కంటే మంచి స్నేహితులం. కాబట్టే ఇంకా కలసి ఉన్నాం అంటూ రమ్యకృష్ణ నవ్వుతూ చెప్పారు. ప్రస్తుతం రమ్యకృష్ణ పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాను 14 ఏళ్లకే హీరోయిన్ అయినట్లు రమ్యకృష్ణ తెలిపారు. నీలాంబరి, శివగామి లాంటి పాత్రలు చేస్తున్నప్పుడు అవి ఐకానిక్ రోల్స్ అవుతాయి అనే సంగతి తనకు ఏమాత్రం తెలియదు అని రమ్యకృష్ణ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories