Itlu Arjuna 3 Days Collections: ఇట్లు అర్జున 3 రోజుల బాక్సాఫీసు.. టాకేమో హిట్‌, మరి కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

Published : Nov 16, 2026, 06:39 AM IST

Itlu Arjuna 3 Days Collections: భారీ బడ్జెట్‌, భారీ అంచనాలతో వచ్చిన `ఇట్లు అర్జున` మూవీ బాక్సాఫీసు వద్ద తడబడుతోంది. టాక్‌కి, వస్తోన్న కలెక్షన్లకి సంబంధం కనిపించడం లేదు. మరి మూడు రోజుల్లో ఈ మూవీ ఎంత రాబట్టిందనేది చూస్తే.

PREV
14
ఇట్లు అర్జున మూవీకి పాజిటివ్‌ టాక్‌

ఈ శుక్రవారం చాలా సినిమాలు పోటీ పడ్డాయి. పెద్ద సినిమాలు లేకపోవడంతో చిన్న చిత్రాలు చాలా విడుదలయ్యాయి. తెలుగు మూవీస్‌, డబ్బింగ్‌ చిత్రాలు కలుపుకొని పది వరకు రిలీజ్‌ అయి ఉంటాయి. కానీ అందులో ఒక్క సినిమా కూడా ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ కాలేకపోయాయి. ఉన్న వాటిలో `ఇట్లు అర్జున` మూవీకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఇందులో హీరో మూగవాడు కావడం, భారీ కమర్షియల్‌ మూవీగా తెరకెక్కడం, కొంత ఫన్‌, మరికొంత లవ్‌, ఇంకొంత యాక్షన్‌ ప్రధానంగా నడవడంతో ఆడియెన్స్ ని కొంత వరకు ఆకట్టుకునే మూవీ అవుతుందని భావించారు. మరి ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సందడి ఎలా ఉంది? టాక్‌ వచ్చిన స్థాయిలో కలెక్షన్లు ఉన్నాయా అనేది చూస్తే.

24
భారీ అంచనాల మధ్య వచ్చిన ఇట్లు అర్జున

`ఇట్లు అర్జున` మూవీలో కొత్త కుర్రాడు సాయి అనీష్‌ రెడ్డి హీరోగా హీరోగా నటించాడు. ఆయన ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత మహేష్‌ రెడ్డి తనయుడు. ఇండస్ట్రీలో, తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌ షాట్‌ కావడంతో ఈ చిత్రంపై హైప్‌ ఏర్పడింది. దీనికితోడు హీరో నాగార్జున సమర్పకులుగా వ్యవహరించారు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అఖిల్‌ వంటి వారు సినిమాని ప్రమోట్‌ చేశారు. దీంతో మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో అనస్వర రాజన్‌ హీరోయిన్‌గా నటించింది. మహేష్‌ ఉప్పల దర్శకత్వం వహించారు. వెంకీ కుడుముల నిర్మించడం విశేషం. ఈ శుక్రవారం(నవంబర్‌ 13)న ఈ చిత్రం విడుదలైంది. పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది.

34
ఇట్లు అర్జున 2 రోజుల కలెక్షన్లు

మరి ఈ సినిమాకి కలెక్షన్లు పరిస్థితి చూస్తే, టాక్‌కి, వస్తోన్న కలెక్షన్లకి సంబంధం లేదు. మూడో రోజు ఆదివారం ఈ సినిమాకి రూ.కోటి 4 లక్షల నెట్‌, కోటి 23 లక్షల గ్రాస్‌ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో ఈ సినిమాని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక మూడు రోజుల్లో ఈ మూవీకి రూ.3.84 కోట్ల గ్రాస్‌, రూ.3.25కోట్ల నెట్‌ కలెక్షన్లు వచ్చాయి. మేజర్‌గా తెలుగు స్టేట్స్ లోనే వస్తున్నాయి. మొదటి రోజు(రూ.1.23కోట్లు)తో పోల్చితే రెండో రోజు (రూ.1.38కోట్లు) కలెక్షన్లు స్వల్పంగా పెరిగాయి. మళ్లీ మూడో రోజు తగ్గాయి. ఇక సోమవారం నుంచి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కలెక్షన్లే సినిమాకి చాలా ముఖ్యం. సాధారణంగా సోమవారం నుంచి వసూళ్లు పడిపోతాయి. ఇది పెరుగుతుందా, తగ్గుతుందా అనేది చూడాలి. ఇప్పుడు వచ్చే కలెక్షన్లని బట్టే సినిమా హిట్టా ఫట్టా అనేది తేలనుంది.

44
బ్రేక్‌ ఈవెన్‌ కష్టమేనా ?

ఇక ఇట్లు అర్జున సినిమాకి దాదాపు రూ.40కోట్ల బడ్జెట్‌ అయ్యిందట. కొత్త కుర్రాడిపై ఇంత బడ్జెట్‌ అంటే మామూలు కాదు. పెద్ద రిస్క్. కానీ భారీగా ఎంట్రీ ప్లాన్‌ చేశారు. అన్ని విషయాల్లో రిచ్‌గా, గ్రాండియర్‌గా ప్లాన్‌ చేశారు. ఇక థియేట్రికల్‌ బిజినెస్‌ విషయానికి వస్తే దాదాపు రూ.10కోట్ల వరకు లెక్క కట్టారట. అంటే రూ.11 కోట్ల షేర్‌ వస్తే సినిమా థియేట్రికల్‌గా హిట్‌. ఈ లెక్కన రూ.22కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రావాలి. ప్రస్తుతం కనీసం నాలుగు కోట్లు కూడా రాలేదు(సాక్నిల్క్ లెక్కల ప్రకారం). మరికొన్ని ట్రేడ్‌ సైట్ల ప్రకారం ఈ మూవీ సుమారు రూ.4-5కోట్లు చేసిందని చెబుతున్నాయి. ఏదేమైనా రెండు కోట్ల షేర్‌ వచ్చింది. ఇంకా రూ.9కోట్ల షేర్‌ రావాలి. రూ.18కోట్ల గ్రాస్‌ వసూలు చేయాలి. ప్రస్తుతం థియేటర్లో ఉన్న పరిస్థితి చూస్తే ఇది అసాధ్యమనే టాక్‌ ఉంది. మరి దాన్ని బ్రేక్‌ చేస్తుందా? లేదా అనేది చూడాలి. ఏదేమైనా ఈ వారంలో వచ్చిన చిత్రాలు అన్నీ బాక్సాఫీసు వద్ద ఫెయిల్‌ అయ్యాయని ట్రేడ్‌ పండితుల అభిప్రాయం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories