బిగ్‌ బాస్‌ హౌజ్‌ మొత్తాన్ని ఏడిపించిన రాము రాథోడ్‌.. ఈ సీజన్‌ టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే

Published : Nov 08, 2025, 08:44 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 తొమ్మిదో వారం వీకెండ్‌లో ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. రాము రాథోడ్‌ ఫ్యామిలీ గుర్తొస్తుందంటే పాట పాడి అందరిని భావోద్వేగానికి గురి చేశారు. 

PREV
15
శివ రీ రిలీజ్‌ బిగ్‌ బాస్‌ షోలో ఆర్జీవీ, అమల సందడి

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ తొమ్మిదవ వారం వీకెండ్‌లో నాగార్జున సందడి చేశారు. నాగ్‌ హీరోగా నటించిన `శివ` మూవీ ఈ నెల 14న రీ రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా ఈ షోలో టీమ్‌ సందడి చేసింది. నాగార్జునతోపాటు రామ్‌ గోపాల్‌ వర్మ, అలాగే హీరోయిన్‌, నాగార్జున భార్య అమల మెరిశారు. ఆ సినిమా విశేషాలను పంచుకున్నారు. `శివ` చిత్రంతోనే తాను, అమల మొదటిసారి కలుసుకున్నట్టు తెలిపారు నాగార్జున. `శివ` మూవీ విడుదలయ్యాక ఆడియెన్స్ రెస్పాన్స్ ఏంటని రాము రాథోడ్‌ ప్రశ్నించగా, చాలా సాడ్‌గా ఫీలయ్యానని చెప్పాడు వర్మ. ఎందుకంటే ఇది చాలా స్టుపిడ్‌ ప్రశ్న అంటూ కౌంటర్‌ వేశాడు వర్మ. నిన్ను వంద రోజులు బిగ్‌ బాస్‌హౌజ్‌లో ఉండమంటే ఉంటావా అని నాగ్‌ వర్మని ప్రశ్నించగా, అందరు సంజనా లాంటి అందమైన అమ్మాయిలు అయితే ఉంటానని చెప్పడం విశేషం. శనివారం ఎపిసోడ్‌కి సంబంధించిన విడుదలైన ఈ ప్రోమో ఆకట్టుకుంది.

25
టాప్‌ 5 కంటెస్టెంట్లలో సుమన్‌ నెంబర్‌ 1

మరో ప్రోమోలో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్ లో బెస్ట్ ఎవరు అని ఆడియెన్స్ అభిప్రాయం తీసుకున్నారు నాగ్‌. అందుకు వారు ఓటింగ్‌ వేశారు. ఇందులో టాప్‌ ప్లేస్‌ని సుమన్‌ శెట్టికి ఇవ్వడం విశేషం. వందకు వంద శాతం సుమన్‌ శెట్టికి మార్కులు పడ్డాయి. దీంతో ఆయనతోపాటు 95శాతం ఓటింగ్‌తో ఇమ్మాన్యుయెల్‌ రెండో స్థానంలో ఉన్నారు. 93 శాతం ఓట్లతో తనూజ మూడో స్థానంలో నిలవగా, 79శాతం ఓట్లతో కళ్యాణ్‌ నాల్గో స్థానం, 78శాతం ఓట్లతో రీతూ ఐదో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత డీమాన్‌ పవన్‌ 72శాతం ఓట్లతో ఆరో స్థానంలో నిలవడం విశేషం. బాటమ్‌లో భరణి ఉండటం గమనార్హం. భరణి సేఫ్‌ గేమర్‌ అని ఆడియెన్స్ ఇంకా ఫీలవుతున్నారు.

35
టాప్‌ కంటెస్టెంట్లకి బిగ్‌ బాస్‌ బెనిఫిట్లు, కానీ కండీషన్స్

ఈ టాప్‌ 6 కంటెస్టెంట్లకి బిగ్‌ బాస్‌ కొన్ని స్పెషల్‌ బెనిఫిట్స్ కల్పించారు. వారికి ఇంటి నుంచి వచ్చిన వాటిని ఇవ్వబోతున్నట్టు తెలిపారు. వాటిని దక్కించుకోవాలంటే హౌజ్‌లో కొందరు త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నారు. అందులో భాగంగా సుమన్‌ శెట్టికి నెక్ట్స్ వీక్‌ డైరెక్ట్ గా కెప్టెన్సీ కంటెండర్‌ అవుతామని తెలిపారు. అయితే ఓ కండీషన్‌ పెట్టారు నాగ్‌. ఇది దక్కాలంటే భరణి తన ఫ్యామిలీ వీక్‌ని సాక్రిఫైజ్‌ చేస్తేనే దక్కుతుందన్నారు. ఆ తర్వాత తనూజకి ఆఫర్‌ ఇస్తూ, మరో రెండు వారాల్లో సిస్టర్‌ పెళ్లి ఉందట. ఆమె వాయిస్‌ నోట్‌ పంపించింది. ఆ నోట్‌ వినాలంటే కళ్యాణ్ కెప్టెన్‌ అయినా ఇమ్యూనిటీ ఉండదన్నారు. ఆ తర్వాత రీతూకి వాళ్ల నాన్న షర్ట్ వచ్చింది. అది పొందాలంటే సంజనాకి సంబంధించిన వస్తువులన్నీ స్టోర్‌ రూమ్‌లో పెట్టాలని తెలిపారు. ఇక ఇమ్మాన్యుయెల్‌ కి వాళ్ల లవర్‌ నుంచి వాయిస్‌ నోట్‌ వచ్చింది. అది వినాలంటే గౌరవ్‌ వద్ద ఉన్న పవర్‌ పోతుందన్నారు. దీనికి ఇమ్మాన్యుయెల్‌ ఓకే చెప్పడం విశేషం. నువ్వు సెల్ఫీష్‌ అంటూ గౌరవ్ ఇమ్మూపై ముద్ర వేయడం మరో విశేషం.

45
ఏడిపించిన రాము రాథోడ్‌

మరో ప్రోమోలో రాము రాథోడ్‌ ప్రస్తావన వచ్చింది. ఈ వారం మొత్తం ఆయన డల్‌గా ఉన్నారు. ఎందుకు డల్‌గా ఉన్నావని నాగార్జున ప్రశ్నించగా, ఫ్యామిలీ గుర్తొస్తుందన్నాడు. `బాధైతుందే` అంటూ అమ్మని గుర్తు చేసుకుంటూ పాట పాడాడు. అందరు కంటెస్టెంట్లని ఏడిపించారు. ఇంటికి వెళ్లిపోవాలనిపిస్తుందన్నారు. చిన్నప్పుడు తమని పెంచడం కోసం పేరెంట్స్ ఐదారేళ్లు వేరే ఊరుకి కూలీ పనికి వెళ్లారు. అలా దూరంగా ఉన్నారని, ఆ తర్వాత తాను ఎదిగి వారిని బాగా చూసుకోవాలనుకునే టైమ్‌లో ఇప్పుడు ఇన్ని రోజులు దూరంగా ఉండాల్సి వచ్చింది. అందుకే అమ్మ బాగా గుర్తొస్తుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు రాము. ఆయన మాటలకు ఇతర కంటెస్టెంట్లు కూడా ఎమోషనల్‌ అయ్యారు.

55
హౌజ్‌ నుంచి వెళ్లిపోతానన్న రాము రాథోడ్‌

దీంతో హౌజ్‌ నుంచి వెళ్లిపోతావా అని నాగార్జున అడగ్గా వెళ్లిపోతానని చెప్పాడు రాము. దీంతో డోర్స్ ఓపెన్‌ చేయమన్నారు నాగ్‌. ఆ తర్వాత కూడా రెడీ అయ్యాడు. అయితే చివరగా ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పగా ఇతర హౌజ్‌ మేట్స్ ఆయన్ని ఆపే ప్రయత్నం చేశారు. మరి వారి మాటలకు కన్విన్స్ అయ్యాడా? హౌజ్‌ నుంచి వెళ్లిపోయాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఈ వారం ఓటింగ్‌లో చాలా లీస్ట్ లో ఉన్నాడు రాము రాథోడ్‌. అందరికంటే తక్కువ రావడమే కాదు, దారుణంగా వచ్చాయి. ఈ ఓటింగ్‌ లెక్కన ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది కూడా అతనే. ఇప్పుడు తనే వెళ్లిపోతానని చెప్పడం గమనార్హం. మొత్తంగా ఆయన కోరిక నెరవేరుతుందని తెలుస్తోంది. ఈ వారం రాము రాథోడ్‌ ఎలిమినేట్‌ కాబోతున్నాడట.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories