రాము రాథోడ్‌ సెల్ఫ్‌ ఎలిమినేట్‌.. బయటపడ్డ ఇమ్మాన్యుయెల్‌ లవ్‌ స్టోరీ.. అర్థరాత్రి ఆ పని

Published : Nov 08, 2025, 11:48 PM IST

Ramu Rathod Eliminate: తొమ్మిదో వారం బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌ నుంచి రాము రాథోడ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. ఆయన సెల్ఫ్‌ ఎలిమినేట్‌ కావడంతో హౌజ్‌ మొత్తం ఎమోషనల్‌ అయ్యారు. 

PREV
16
రాము రాథోడ్‌ సెల్ఫీ ఎలిమినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9 తొమ్మిదో వారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఊహించని విధంగా ఈ వారం ఎలిమినేషన్‌ జరిగింది. రాము రాథోడ్‌ సెల్ఫ్ ఎలిమినేషన్‌ చేసుకున్నాడు. అందరిని ఎమోషనల్‌కి గురి చేసి తాను హౌజ్‌ని వీడాడు. ఎంత బ్రతిమాలినా వినకుండా హౌజ్ ని వీడాడు. 

26
`శివ` కాదు హర్రర్‌ సినిమా చేయాలనుకున్నా వర్మ

ఇక శనివారం ఎపిసోడ్‌లో `శివ` మూవీ రీ రిలీజ్‌ సందర్భంగా రామ్‌ గోపాల్‌ వర్మ, హీరోయిన్‌ అమల, నాగార్జున సందడి చేశారు. కాసేపు `శివ` గురించిన విషయాలను పంచుకున్నారు. ఈ మూవీ కంటే ముందు తాను హర్రర్‌ సినిమా చేయాలని అనుకున్నట్టు, నాగార్జున కారణంగా ఈ కథ రాసుకున్నట్టు తెలిపారు వర్మ. అదే సమయంలో తాను అంతకు ముందు చేసిన సినిమాలు కొన్ని హిట్‌ అయ్యాయి. కానీ సంతృప్తిగా అనిపించడం లేదని, ఏదైనా కొత్తగా, బ్రేక్‌ ఇచ్చే చేయాలని, ఆ సమయంలో వర్మ తగిలాడని, ఆయన కథ చెప్పిన విధానం నచ్చి ఈ మూవీ చేసినట్టు నాగార్జున తెలిపారు. ఈ మూవీ తనకు హార్ట్ లో ఉంటుందని అమల అన్నారు.

36
ఈ సీజన్‌ టాప్‌లో సుమన్‌ శెట్టి

ఇక అనంతరం ఈ సీజన్‌లో టాప్‌ కంటెస్టెంట్లు ఎవరు, బాటమ్‌లో ఉన్నదెవరు అనేది ఆడియెన్స్ పోల్‌ తీసుకున్నారు నాగార్జున. ఇందులో టాప్ లో సుమన్‌ శెట్టి, ఇమ్మాన్యుయెల్‌, తనూజ, కళ్యాణ్‌, రీతూ, డీమాన్‌ పవన్‌ ఉన్నారు. భరణి, నిఖిల్‌, గౌరవ్‌, సంజనా బాటమ్‌లో ఉన్నారు. వీరికి కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు బిగ్‌ బాస్‌. అందుకోసం బాటమ్‌లో ఉన్న వారు కొన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. నెక్ట్స్ వీక్‌ డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్‌ అయ్యే ఛాన్స్ ని సుమన్‌ శెట్టి రిజెక్ట్ చేశారు. భరణి ఫ్యామిలీ వీక్‌ సాక్రిఫైజ్‌కి నో చెప్పారు.

46
ఇమ్మాన్యుయెల్‌ లవ్‌ స్టోరీ బయటపడింది

ఆ తర్వాత ఇమ్మాన్యుయెల్‌కి తన లవర్‌ నుంచి వాయిస్‌ మెసేజ్‌ వచ్చింది. అందుకోసం గౌరవ్‌ కి ఉన్న బ్లెస్సింగ్‌ పవర్‌ని త్యాగం చేయాల్సి ఉంటుందన్నారు. అయితే ఇమ్మాన్యుయెల్‌ ఆ వాయిస్‌ వింటానన్నాడు. అందులో తన ప్రియురాలు మాట్లాడుతూ, ఇక్కడ తాము చాలా బాగున్నామని, అమ్మా, నాన్న కూడా ఆనందంగా ఉన్నారని, ఆట బాగా ఆడుతున్నావని చెప్పింది. నువ్వు ఒంటరిగా కూర్చొని మాట్లాడుతుంటే తనతోనే మాట్లాడుతున్నట్టుగా అనిపించిందని చెప్పింది. నువ్వు తనకు అడుగు దూరంలోనే ఉన్నావని పేర్కొంది. ఈ డిస్టెన్స్ తమ మధ్య బాండింగ్‌ని మరింత పెంచుతుందని, మరింత స్ట్రాంగ్‌ అవుతుందని, బాగా ఆడాలని పేర్కొంది. తందూరి ఛాయ్‌ మిస్‌ అవుతున్నట్టు చెప్పింది. ఇది ఆద్యంతం ఆకట్టుకుంది. ఆరేళ్లుగా తాము ప్రేమించుకుంటున్నట్టు తెలిపారు ఇమ్మాన్యూయెల్‌. ఎప్పుడూ దూరంగా లేమని తెలిపారు. తందూరి ఛాయ్‌ గురించి నాగ్‌ అడగ్గా, ఈ తందూరి ఛాయ్‌ అంటే ఆమెకి ఇష్టమని, డీఎల్‌ఎఫ్‌ వద్ద అర్థరాత్రి తందూరి ఛాయ్‌ తాగేవాళ్లమని తెలిపారు. మొత్తానికి తన సీక్రెట్‌ లవ్‌ స్టోరీని బయటపెట్టారు ఇమ్మూ.

56
రెండు వారాల్లో సిస్టర్‌ పెళ్లి, వాయిస్‌ త్యాగం చేసిన తనూజ

తనూజకి వాళ్ల సిస్టర్‌ వాయిస్‌ రాగా, అందుకు కళ్యాణ్‌ ఈ సీజన్‌ మొత్తం ఇమ్యూనిటీ కోల్పోతాడు. అందుకు ఆమె నో చెప్పింది. రీతూ కి వాళ్ల నాన్న షర్ట్ రాగా, ఆమె తీసుకుంది. అందుకుగానూ సంజనా శారీలు స్టోర్‌ రూమ్‌లో పెట్టాల్సి వచ్చింది. మరోవైపు డీమాన్‌ పవన్‌కి వాళ్ల ఫ్యామిలీ ఫోటో చూసే అవకాశం కల్పించారు. అందుకోసం రీతూ చౌదరీ తన తండ్రి ఫోటో చూసే అవకాశం కోల్పోతుంది. డీమాన్‌ తన ఫ్యామిలీ ఫోటోని త్యాగం చేసి రీతూకి వాళ్ల నాన్న ఫోటో దక్కేలా చేశారు. ఇలా ఇమ్మాన్యుయెల్, రీతూ తప్ప మిగిలిన వాళ్లంతా త్యాగాలు చేయడం విశేషం. మరోవైపు కళ్యాణ్‌ తన చికెన్‌, మటన్‌ని త్యాగం చేసి నిఖిల్‌ని రెండు వారాల నామినేషన్‌ నుంచి తప్పించారు. అదే సమయంతో తనూజకి వాళ్ల అక్క వాయిస్‌ వినే అవకాశం కల్పించారు. అందుకు ఆయన రెండు వారాలు నామినేట్‌ అవుతాడు. ఇది విన్న తనూజ కళ్యాణ్‌ త్యాగాన్ని రిజెక్ట్ చేసింది.

66
హౌజ్‌ని వీడిన రాము రాథోడ్‌

ఇదంతా ఓ ఎత్తు ఇప్పుడు రామురాథోడ్‌ ఎపిసోడ్‌ మరో ఎత్తు. ఆయన ఈ వారం మొత్తం డల్‌గా ఉన్న నేపథ్యంలో హోస్ట్ నాగార్జున ఏంటి రాము ఇలా ఉన్నావంటే, ఫ్యామిలీ గుర్తుకొస్తుందని, అమ్మ గుర్తుకొస్తుందని తెలిపారు. నిద్ర పట్టడం లేదని, అందరు ఉన్నా ఒంటరిగా ఫీలవుతున్నట్టు తెలిపారు. పాట పాడి తన బాధని బయటపెట్టాడు. తమది పెద్ద ఫ్యామిలీ అని, చాలా గజిబిజీగా ఉంటుందని, తాను లేకపోతే ఎలా ఉందో అనే టెన్షన్‌గా ఉందని, భయమనిస్తుందని చెప్పాడు. ఇంట్లో ఏడెనిమిది మంది పిల్లలుంటారు వాళ్లు గుర్తుకొస్తున్నారు, డాగ్స్ గుర్తుకొస్తున్నాయని, ఇక్కడ ఉండలేకపోతున్నా అని చెప్పాడు రాము. నాగార్జున ఎన్నిసార్లు అడిగినా వెళ్లిపోతా అన్నాడు. హౌజ్‌మేట్స్ రిక్వెస్ట్ చేసినా వినలేదు. ఎట్టకేలకు సెల్ఫ్‌ గా ఎలిమినేట్‌ అయ్యాడు. దీంతో అంతా భావోద్వేగానికి గురయ్యారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories