షాక్: త్రివిక్రమ్ పాన్‌ ఇండియా సినిమా.. షూటింగ్ కే రెండేళ్లు

First Published | Oct 22, 2024, 10:27 AM IST

త్రివిక్రమ్ ఈ సినిమాతో ప్యాన్ ఇండియా కాన్సెప్టుని  నెక్ట్స్ లెవిల్ లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. రీజనల్ టచ్ ఇస్తూనే ప్యాన్ ఇండియా ఫిల్మ్ భారీగా తెరకెక్కించే ప్లాన్‌ చేస్తున్నారు. 

allu arjun, trivikram srinivas, pan india movie

ప్యాన్ ఇండియా సినిమాలు ఇవాళ నడుస్తున్న ట్రెండ్. ముఖ్యంగా తెలుగులో వచ్చే సినిమాలు చాలా వరకూ ప్యాన్ ఇండియా ఉండాలని స్టార్స్ కోరుకుంటున్నారు. రీజనల్ టచ్ తో ఉండే కథలు కన్నా దేశం మొత్తం నచ్చే కథలకే హీరోలు సైతం ప్రయారిటీ ఇస్తున్నారు. రాజమౌళితో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు ప్రతీ డైరక్టర్ కీ ప్రెజర్ గా మారింది. ప్యాన్ ఇండియా కథ లేకపోతే హీరోలు దగ్గరకు రానివ్వటం లేదు. లోకల్ నేటివిటి కథలు చేసే త్రివిక్రమ్ సైతం ఇప్పుడు ప్యాన్ ఇండియా ఫిల్మ్ కు రెడీ అవుతున్నారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

allu arjun, trivikram srinivas, pan india movie


త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి నుంచి రీజనల్ కంటెంట్ కే ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకే ఆయన సినిమాలు రీమేక్ అవ్వటం తక్కువ. అయినా అక్కడ పెద్దగా పోవు. లోకల్ ప్లేవర్ నే ఆయన నమ్ముకుంటూ వచ్చారు. అది మహేష్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు మరో హీరో కావచ్చు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ కూడా తన కలాన్ని ప్యాన్ ఇండియా వైపు తిప్పాల్సిన పరిస్దితి వచ్చింది. ఈ మేరకు ఓ కథ రాసి అల్లు అర్జున్ నేరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బన్ని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి.

 అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రం లార్జ్ స్కేల్ లో ,లావిష్ గా రూపొందనుంది. త్రివిక్రమ్ నుంచి ఇప్పటివరకూ చూడని కథగా రాబోతోంది. గత కొంతకాలంగా త్రివిక్రమ్ పూర్తిగా ఈ స్క్రిప్టు మీదే దృష్టి పెట్టారు. ప్రీ ప్రొడక్షన్ కు కూడా ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారు. 2025 వేసవి వెళ్లాక ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది.


allu arjun, trivikram srinivas, pan india movie

త్రివిక్రమ్ , అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి సన్నాఫ్  సత్యమూర్తి, అల వైకుంఠపురంలో చిత్రాలు ఎంత మంచి హిట్ సినిమాలో తెలిసిందే. ఈ సారి మరో సినిమాకు వీళ్లిద్దరూ కలుస్తున్నారు. అయితే ఈ సారి వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమా మామూలు సినిమా కాదు అంటున్నారు. 

allu arjun, trivikram srinivas, pan india movie

అలాగే ఈ చిత్రం రెండేళ్ల పాటు మేకింగ్ లో ఉండనుంది. త్రివిక్రమ్ ఏ చిత్రం షూట్ లో ఇంతకాలం లేదు. త్రివిక్రమ్ ఈ సినిమాతో ప్యాన్ ఇండియా కాన్సెప్టుని  నెక్ట్స్ లెవిల్ లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. రీజనల్ టచ్ ఇస్తూనే ప్యాన్ ఇండియా ఫిల్మ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇండియాలోని పెద్ద స్టార్స్ లో అల్లు అర్జున్ ఒకరు కాబట్టి బడ్జెట్ కు సమస్య ఉండదు. గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ కలిపి ఈ ప్రాజెక్టుని నిర్మించనున్నాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఇద్దరికి భారీ రెమ్యునరేషన్ లు ముట్టనున్నాయి. మరిన్ని విషయాలు త్వరలో బయిటకు వస్తాయి. 


ఇప్పటికే నిర్మాత నాగ వంశీ అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. "అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా మా బ్యానర్ లోనే త్రివిక్రమ్ గారి తో ఉంటుంది. ఓ పాన్ ఇండియా సబ్జెక్టుని త్రివిక్రమ్ గారు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. చాలా పెద్ద కథ అది. భారీగానే పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


'ఆయ్' మూవీ పాట్‌ లాంచ్‌ ఈవెంట్‌లో బన్నీవాస్  మీడియాతో  అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ మూవీపై కూడా అప్‌డేట్‌ ఇచ్చారు. పుష్ప: ది రూల్‌ మూవీ తర్వాత బన్నీ త్రివిక్రమ్‌ మూవీ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఆ చిత్రం పాన్‌ ఇండియాగా రానుంది.

ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ కోసమే ఏకంగా ఏడాదిన్నర సమయం పడుతుందన్నారు. కనివినీ ఎరుగని రీతిలో దేశంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తీయబోతున్నారంటూ బన్నీవాసు సాలీడ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. అలాగే ఈ మూవీ కాన్సెప్టను లాక్‌ చేయానికి అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ ఏడాదిన్నర టైం తీసుకున్నారని బన్నీ వాసు చెప్పారు. ఇదివరకు ఎన్నడూ చూడని ఓ కొత్త జానర్‌ అని, అందుకే త్రివిక్రమ్‌ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ఎక్కువ టైం తీసుకొంటున్నారని ఆయన పేర్కొన్నారు.

త్రివిక్రమ్ పెన్నుకు పదునెక్కువ.. మాటలకు సూటితనం ఎక్కువ.. అందుకే ఆయన మాటల్లో చమత్కారాలు రాలుతుంటాయి. సామెతలు డొర్లుతుంటాయి. లాజిక్ లు బ్రేక్ డాన్స్ చేస్తుంటాయి. చిట్టి మెదళ్ళు కూడా చిక్కుముడులు విప్పి ఆనందించగలిగే పదాలు చెప్పడంతో త్రివిక్రమ్ సిద్దహస్తుడు. అశ్లీలం లేని..హాస్యం తెరపై చూపించడంతో.. త్రివిక్రమ్ అభినవ జంధ్యాల అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

త్రివిక్రమ్ ఇప్పటి వరకూ 11 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ఉత్తమ డైలాగ్ రైటర్‌గా ఆరు నంది పురస్కారాలను అందుకున్న ఆయన.. ఉత్తమ దర్శకుడిగా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సాధించారు. అలానే భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015 లో ఆయనకు బీఎన్ రెడ్డి జాతీయ అవార్డును ప్రధానం చేసింది.

read more: ఉప్పు, పప్పుకు కూడా అప్పు చేయాలి, పోరా అని అవమానించిన కిరాణావాడు, ఒకప్పటి రాజమౌళి దుస్థితి తెలుసా?
 

Latest Videos

click me!