నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో డీఎన్‌ఈజీ, యశ్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన రామాయణ సినిమా మలయాళం, హిందీ, కన్నడ, తెలుగు, తమిళం అనే ఐదు భాషల్లో విడుదలైంది.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రీతిలో భారీ తారాగణం ఈ ఎపిక్ మూవీ కోసం ఒకటయ్యారు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తరతరాలుగా పూజించబడే ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడిగా రణబీర్ కపూర్ నటించాడు. సీతాదేవిగా సాయి పల్లవి నటించగా, ఆమె ఆ పాత్రకు ఎంతో సహజత్వం, బలం, దయను తీసుకొచ్చింది.