2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ విజువల్ వండర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఐమ్యాక్స్‌తో పాటు పలు ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. మన ఇండియన్ ఎపిక్‌ను గ్లోబల్ ఆడియన్స్‌కు గ్రాండ్‌గా పరిచయం చేసేందుకు మూవీ టీమ్ రెడీ అయింది.
ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ మ్యూజిక్. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మర్ కలిసి 'రామాయణం' సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై అంచనాలు స్కై రేంజ్‌కు చేరుకున్నాయి.
ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్‌కు చెందిన నమిత్ మల్హోత్రా, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ 2026 నవంబర్ 5న రిలీజ్ అవుతుండగా.. సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రానుందని అంచనా. హిందీ, కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.