Trigun: చివరి నిమిషంలో మళ్ళీ బుక్కైన అమన్.. ముకేశ్, వర్షిణి జాగ్రత్త.. సుధీర్ ని పాముతో పోల్చిన త్రిగుణ్

Published : Oct 20, 2026, 11:00 PM IST

బిగ్ బాస్ హౌస్ లో 44 వ రోజు కూడా నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. త్రిగుణ్ సుధీర్ ని పాముతో పోల్చుతూ నామినేట్ చేశాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది.

PREV
14
బిగ్ బాస్ తెలుగు 10

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మంగళవారం కూడా నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. ఇంటి సభ్యులు ఒక్కొక్కరూ ఒక్కొక్కరిని బలమైన పాయింట్స్ తో నామినేట్ చేశారు. ముందుగా త్రిగుణ్.. సుధీర్ ని నామినేట్ చేశారు. సుధీర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాడు. అతడికి ఒక క్లారిటీ అనేది లేదు అంటూ త్రిగుణ్ నామినేట్ చేశాడు. దీనితో వీరిద్దరి మధ్య పాత విషయాలు చర్చకు వచ్చాయి.

24
మీరు ఒక పాముతో ఉన్నారు

దీనితో వాగ్వాదం జరిగింది. అనవసరమైన ప్రామిస్ లు చేయడం వాటిని బ్రేక్ చేయడం సుధీర్ కి అలవాటు అంటూ త్రిగుణ్ తెలిపారు.వర్షిణి, ముకేశ్ ల పక్కనే ఉంటూ వాళ్ళు చెప్పింది చేస్తూ ఉంటాడు. వర్షిణి, ముకేశ్ ఇద్దరూ జాగ్రత్తగా ఉండాలి.. మీ పక్కన ఒక పాము ఉంది అంటూ సుధీర్ ని పాముతో పోల్చాడు.

34
సింపతీ గేమ్

ఆ తర్వాత ఆర్కే వచ్చి ఝాన్సీని నామినేట్ చేశాడు. ఝాన్సీ అగ్ని పరీక్ష లో చాలా బాగా గేమ్ ఆడింది. బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కించుకుంది. కానీ హౌస్ లో ఆమె నవ్వు కంటే ఎప్పుడూ ఏడుపే కనిపిస్తోంది. సింపతీ గేమ్ ఆడుతోంది అని ఆర్కే నామినేషన్ పాయింట్ పెట్టారు. సుధీర్.. ఆర్కేని నామినేట్ చేస్తూ అతడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అతి మంచితనం ప్రదర్శిస్తున్నాడు అని తెలిపారు. స్వేతా.. త్రిగుణ్ ని నామినేట్ చేసింది. నీతూని వర్షిణి నామినేట్ చేస్తూ.. నీతూకి మైక్ పెట్టుకోవడం కూడా సరిగ్గా రాదు అని తెలిపింది.

44
చివరి నిమిషంలో బుక్కైన అమన్

ఇక చివర్లో అమన్ కి కెప్టెన్ రామ్ ప్రసాద్ వల్ల దెబ్బ పడింది. పాపం అమన్ ఇలా మల్టిపుల్ టైమ్స్ జరుగుతోంది. ఇక అంతా అయిపొయింది.. అమన్ గెలిచినట్లే అనుకున్న తరుణంలో అతడు ఎదురు దెబ్బలు తింటున్నాడు. ఇక నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది.. అమన్ సేఫ్ అయ్యాడు ఈవారం నామినేషన్స్ లో లేడు అని అనుకున్నారు. బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు. నామినేషన్స్ లో లేని అమన్, దేబ్జానీ, నరేష్, ముకేశ్ లలో ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేసే అవకాశం కెప్టెన్ కి ఉంది అని బిగ్ బాస్ తెలిపారు. దీనితో రామ్ ప్రసాద్ అమన్ ని నామినేట్ చేశారు. మొత్తంగా ఈ వారం దక్షి, వర్షిణి, రోహిత్, సుధీర్, త్రిగుణ్, నీతూ, రామకృష్ణ, శివ, ఝాన్సీ, స్వేత, అమన్, వంశీ నామినేట్ అయ్యారు.

Read more Photos on
click me!

Recommended Stories