డైరెక్టర్ ప్రేమించిన అమ్మాయితో వెంకటేష్ మూవీ, వద్దని చెప్పేసిన రామానాయుడు.. ఆమె ఎవరో తెలుసా

Published : Nov 14, 2025, 01:59 PM IST

విక్టరీ వెంకటేష్ హీరోగా, క్రేజీ నటి హీరోయిన్ గా ఓ సినిమా రావలసింది. ఆ చిత్రానికి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కానీ వెంకటేష్ తండ్రి రామానాయుడు ఆ చిత్రాన్ని ఆపేశారు. 

PREV
15
వెంకటేష్ సినీ కెరీర్ 

విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో ఎందరో దర్శకులతో కలిసి పనిచేశారు. మూవీ మొఘల్ రామానాయుడు తనయుడిగా వెంకటేష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీనితో వెంకీకి ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ ఎంట్రీ లభించింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన వెంకటేష్ తొలి చిత్రం కలియుగ పాండవులు సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఒక్కో సినిమాలో నటిస్తూ స్టార్ డమ్ కి చేరువవుతూ వచ్చారు. 

25
భానుప్రియని పరిచయం చేసిన వంశీ 

వెంకటేష్ సినిమాల విషయంలో రామానాయుడు చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఈ క్రమంలో డైరెక్టర్ వంశీ ఒక కథ తీసుకుని వచ్చారు. డైరెక్టర్ వంశీ నే భానుప్రియని తన సితార చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వంశీ వరుసగా ఆమెతోనే సినిమాలు చేశారు. సితార, ఆలాపన, అన్వేషణ, ప్రేమించు పెళ్లాడు ఇలా వరుస చిత్రాలు వంశీ, భానుప్రియ కాంబోలో వచ్చాయి. 

35
భానుప్రియతో ప్రేమలో వంశీ 

ఈ క్రమంలో వంశీ భానుప్రియతో ప్రేమలో పడ్డారు. ఆమెని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరి పెళ్లి జరగలేదు. ఆ తర్వాత వంశీ.. భానుప్రియతో మరో సినిమా చేసే ప్రయత్నం చేశారట. ఆ సినిమా పేరు గాలికొండపురం రైల్వే గేట్. వెంకటేష్ హీరో, భానుప్రియ హీరోయిన్. డైరెక్టర్ వంశీ కథని రామానాయుడు గారికి వినిపించారు. 

45
రిజెక్ట్ చేసిన రామానాయుడు 

కథ విన్న తర్వాత రామానాయుడు మాట్లాడుతూ.. ఇదేంటయ్యా, నేను మా అబ్బాయిని మాస్ హీరోని చేద్దాం అనుకుంటుంటే ఇలాంటి కథ తీసుకువచ్చావు. ఈ కథలో మొత్తం హీరోయినే కనిపిస్తోంది.. హీరో కనిపించడం లేదు. ఈ కథ వద్దు, వేరే కథ ఏదైనా తీసుకురండి అని చెప్పారట. 

55
వెంకటేష్, భానుప్రియ కాంబినేషన్ 

ఆ విధంగా గాలికొండపురం రైల్వే గేట్ చిత్రం ఆగిపోయింది. కానీ వెంకటేష్, భాను ప్రియ మాత్రం ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. వీరి కాంబోలో స్వర్ణకమలం, శ్రీనివాస కళ్యాణం, జయం మనదేరా లాంటి చిత్రాలు వచ్చాయి. 

Read more Photos on
click me!

Recommended Stories