1000 కోట్లు పక్కా.. విడుదలకు ముందే విజయ్ జననాయగన్ రికార్డ్

Published : Nov 14, 2025, 01:04 PM IST

రిలీజ్ కు  ముందే రికార్డు సృష్టించింది  జననాయగన్ సినిమా. దళపతి విజయ్ నటిస్తున్నఈ సినిమా విడుదలకు ముందే కోట్లలో బిజినెస్  సాధించినట్లు సమాచారం. 1000 కోట్ల కలెక్షన్స్ పక్కా అంటున్నారు స్టార్ హీరో ఫ్యాన్స్. 

PREV
15
సంక్రాంతికి భారీ ట్రీట్ ..

వచ్చే ఏడాది సంక్రాంతికి అభిమానుల కోసం  భారీ ట్రీట్ ను రెడీ చేస్తున్నాడు దళపతి విజయ్.  అయితే, ఇది విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో.. సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.

25
బాలకృష్ణ సినిమాకు రీమేక్ గా..

దళపతి విజయ్ నటించిన 'జననాయగన్' చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో సటసింహం బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని అంటున్నారు. ఇటీవల విడుదలైన మొదటి పాటతో ఇది దాదాపుగా ఖరారైంది.

35
దళపతి చివరి సినిమాపై భారీ అంచనాలు

అభిమానుల భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, ప్రియమణి, వరలక్ష్మి శరత్‌కుమార్ తదితరులు నటిస్తున్నారు.

45
జననాయగన్ సినిమా హక్కుల కోసం పోటీ..

KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా హక్కుల కోసం ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈమూవీ భారీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని నమ్ముతున్నారు. 

55
జననాయగన్ ప్రీ-రిలీజ్ బిజినెస్

'జననాయగన్' ప్రీ-రిలీజ్ బిజినెస్ ద్వారానే 325 కోట్లు వసూలు చేసిందని సమాచారం. తమిళనాడు థియేట్రికల్ హక్కులు 100 కోట్లు, ఓవర్సీస్ హక్కులు 80 కోట్లు, ఆడియో హక్కులు 35 కోట్లకు అమ్ముడయ్యాయి. ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ 110 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేయడం పక్కా అనేనమ్మకంతో ఉన్నారు మేకర్స్. అటు ఫ్యాస్స్ కూడా  ఈ సినిమా కోలీవుడ్ నుంచి ఫస్ట్ 1000 కోట్ల సినిమా అవుతుందంటున్నారు. ఇప్పటి వరకూ కలెక్షన్స్ విషయంలో విజయ్ సినిమాలే ముందుండటంతో.. సినిమాల నుంచి వెళ్లిపోయేముందు విజయ్ రికార్డ్ క్రియేట్ చేస్తాడన్న నమ్మకంతో ఉన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories